ఆస్తమా ఉందా..? అయితే ఈ యోగాసనాలు రోజూ వేస్తే సరి.. శ్వాస ఫ్రీగా..

-

చాలా మంది ఆస్తమా సమస్యతో బాధపడుతూ ఉంటారు మీరు కూడా ఆస్తమాతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన జీవన విధానం మనం తీసుకునే ఆహారం నిద్ర ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మెడిటేషన్, యోగ వంటివి కూడా సహాయపడతాయి. ఆస్తమా తో బాధపడే వాళ్ళు ఈ యోగాసనాలు వేస్తే కచ్చితంగా ఆస్తమ సమస్య నుండి బయటపడొచ్చు. బ్రీతింగ్ కూడా బాగా అందుతుంది. ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది. మరి ఆరోగ్య నిపుణులు చెప్పిన యోగాసనాల గురించి చూద్దాం.

ఆస్తమా తో బాధపడే వాళ్ళు సుఖాసనం వేయడం వలన ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెరుగుతుంది మైండ్ కూడా రిలాక్స్ గా ఉంటుంది. చక్కటి ప్రయోజనాలు సుఖాసనం ద్వారా పొందొచ్చు.
భుజంగాసనం కూడా ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీని పెంచుతుంది. ఛాతీని ఎక్స్పాండ్ చేసి శ్వాస బాగా ఆడేటట్టు చేస్తుంది. ఆస్తమాతో బాధపడే వాళ్ళు భుజంగాసనాన్ని కూడా వేయొచ్చు. సేతు బందాసనం కూడా ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ పెంచుతుంది. ఆక్సిజన్ ఫ్లో ని లోపలికి చేరేటట్టు చేస్తుంది.
త్రికోణాశనం కూడా ఊపిరితిత్తులని ఎక్స్పాండ్ చేస్తుంది శ్వాస బాగా అందుతుంది కాబట్టి ఈ ఆసనం ని కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు.
అదో ముఖస్వనాశనం కూడా ఊపిరితిత్తుల యొక్క సామర్ధ్యాన్ని పెంచుతుంది శ్వాస బాగా ఆడేటట్టు చేస్తుంది.
మత్స్యాసనం కూడా ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ ని పెంచుతుంది. ప్రాణాయామం చేయడం వలన కూడా మీరు ఆస్తమా నుండి రిలీఫ్ నీ పొందొచ్చు. ఇలా ఈ చిన్న చిన్న ఆసనాలను ట్రై చేస్తే కచ్చితంగా ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది దానితో పాటుగా శ్వాస బాగా అందుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరి ఆలస్యం ఎందుకు ఈ రోజు నుండి మొదలు పెట్టేయండి. ఆరోగ్యంగా వుండండి ఈ యోగాసనాలతో..

Read more RELATED
Recommended to you

Latest news