సుశాంత్ సింగ్ రాజ్ వర్థంతి.. ఆ విషాదానికి ఏడాది.

-

దివంగత నటుడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషాదానికి ఏడాది కావొస్తుంది. 2020 జూన్ 14వ తేదీన తన ప్లాట్ లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిచోరే, ధోనీ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని హీరోగా స్థానాన్ని నిలబెట్టుకున్న సుశాంత్, బలవన్మరణానికి పాల్పడడం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు ఉండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చర్య అందరినీ విస్మయానికి గురి చేసింది.

బంగారు భవిష్యత్తు ఉన్న హీరో అర్థంతరంగా కాలం చెందడం సినిమా అభిమానులని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుశాంత్ సింగ్ మరణానంతరం అనేక వార్తలు బయటకి వచ్చాయి. బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువగా ఉండడం వల్ల సుశాంత్ సింగ్ కి అవకాశాలు రాలేదని, వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోయాయని, అవకాశాలు రాకుండా చేసారని, ఇదంతా నెపోటిజం కారణంగానే జరిగిందని, కంగనా రనౌత్ లాంటి వాళ్ళు బాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడ్డారు.

అదీగాక మాదక ద్రవ్యాల వాడకం అనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. దీనిలో సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు ఎలా ఉన్నా బాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు చేసి, ఎలాంటి సినిమా నేపథ్యం లేని వారికి ఆదర్శంగా నిలిచిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, హఠాత్తుగా తన ప్రాణాన్ని తీసుకోవడం ఎందరినో బాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news