విశాఖలో వేడెక్కిన రాజకీయం

-

విశాఖ: నగరంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇంకా రాజధాని కాలేదు.. అప్పుడే భూకబ్జాలు పెరిగిపోయాయి. అయితే నిజంగా కబ్జా జరిగాయా.. లేదా అనేది మాత్రం స్పష్టం లేదు. కానీ వైసీపీ, టీడీపీ రాజకీయం దుమారం రేపుతున్నాయి. గత కొంతకాలంగా టీడీపీ నేతలు, వివిధ వ్యక్తులు భూములు ఆక్రమించారని, వాటిని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. తాజాగా ఓ ఆక్రమణను అధికారులు కూల్చివేశారు. అయితే ఆ ఆక్రమణ టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావుకు సంబంధించిన భూములని ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారంపై సోమవారం పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. తమ కుటుంబం తొలి నుంచి వివిధ పార్టీల్లో రాజకీయంగా పని చేసిందని ఆయన తెలిపారు. కానీ ఈ రకమైన రాజకీయాలను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. తనకు సంబంధం లేని భూములను కూల్చివేసి తనవిగా ప్రచారం చేస్తున్నారని ఓ పార్టీకి చెందిన నేతలపై పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. రాజకీయ కక్షలతోనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ ముందు ధర్నా చేపడతామని అంటున్నారు. 2014లో తమపై ఐటీ దాడులు జరిగాయన్నారు. 2019లో ఎన్నికల అఫిడవిడ్‌లో తమ ఆస్తుల వివరాలను ప్రకటించానని పేర్కొన్నారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news