అయితే లాక్ డౌన్ కారణంగా గతకొన్నాళ్ళుగా సినిమా షూటింగ్ లు, థియేటర్స్ అన్ని బందు కావటంతో సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక పని చేస్తూ ఆ వీడియోలు తీసి సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తన తండ్రి రవిరాజా పినిశెట్టి కోసం హెయిర్ స్టైలిస్ట్‌గా మారారు ఆది. ఆయనకు హెయిర్ కట్ చేసి, క్లీన్ షేవ్ చేసి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని.. ఆ వీడియోని ట్విటర్ లో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
ఇప్పుడు అదే తరహాలో మెగాస్టార్ చిరంజీవికి ఆయన పెద్ద కూతురు సుస్మిత కటింగ్ చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. కరోనా వలన బార్భర్ షాప్‌కి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తన కూతురితో కటింగ్ చేయించుకున్నాడు. ఫాదర్స్ డే రోజు సుస్మిత పోస్ట్ చేసిన ఈ వీడియోని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.