స్వప్న దత్ : ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా.. కారణం.?

టాలీవుడ్ దిగ్గజ నిర్మాత అయిన అశ్వినీ దత్ చిన్న కూతురు నిర్మాత స్వప్న దత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇకపోతే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కు నందమూరి ఫ్యామిలీకి మంచి అవినాభావ సంబంధం ఉంది. అంతేకాదు వైజయంతి మూవీస్ బ్యానర్ పై కూడా సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అశ్వినీ దత్ సీనియర్ ఎన్టీఆర్ తోనే కాదు జూనియర్ ఎన్టీఆర్ తో కూడా పలు చిత్రాలను నిర్మించారు. అలా స్టూడెంట్ నెంబర్ వన్ , కంత్రి, శక్తి సినిమాలు నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా సమయంలోనే ఎన్టీఆర్ కి కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పవచ్చు.Swapna Dutt | V CINEMA - Biography, Photos, Movies, Age, Height, Family

ఇకపోతే సీతారామం సినిమా సక్సెస్ పొందిన నేపథ్యంలో అశ్వినీ దత్ కుమార్తె స్వప్న దత్ కూడా నిర్మాతగా మంచి పేరును సంపాదించుకున్నారు. ఇక ఈ క్రమంలోని ఒక ఇంటర్వ్యూకి హాజరై ఎన్నో విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలోని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ కూడా ఆమె వెల్లడించింది. అసలు విషయంలోకి వెళ్తే.. స్వప్న దత్ పెళ్లి విషయంలో ఎన్టీఆర్ చాలా కీలక పాత్ర పోషించాడట. స్వప్న దత్ .. ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని ప్రేమించింది. 2010 డిసెంబర్ 19వ తేదీన వీరి వివాహం జరిగింది. ఇక ఈ దంపతులకు నవ్య వైజయంతి అనే కుమార్తె కూడా ఉంది. ఇక ఎన్టీఆర్ కి తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎందుకు అన్నది అనే విషయాన్ని కూడా ఆమె వెల్లడించింది.స్వప్న దత్ మాట్లాడుతూ.. నా లవ్ మేటర్ వర్క్ అవుట్ అవ్వడం లేదులే.. కాస్త గ్యాప్ తీసుకుందామని అనుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్ వచ్చి నాన్నగారిని కన్విన్స్ చేశాడు. ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఎక్కువగా డిలే చేయకూడదు.. నేను వచ్చి మాట్లాడుతాను అంటూ షూటింగ్ మధ్యలోనే మేకప్ తీయకుండా వచ్చి మరీ నాన్నతో మాట్లాడారు. ఇక నా జీవితంలో ఎన్టీఆర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇక ఇప్పటికే ఆయనను మర్చిపోలేను..తనను కానీ తను చేసిన సహాయాన్ని కానీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అంటూ ఆమె తెలిపింది. ఇక మా బ్యానర్ లో ఎన్టీఆర్ సినిమా చేసిన చేయకపోయినా జీవితాంతం స్నేహితులుగానే ఉంటాము అంటూ ఆమె వెల్లడించింది.