ఎండవేడిని తట్టుకోలేక సైరా నటుడు మృతి.. షాక్‌లో రామ్‌చరణ్

అబ్బబ్బ.. ఏం ఎండలురా నాయనా. ఈ ఎండలు మనకంటే అలవాటు కానీ.. విదేశీయులకు ఏం అలవాటు ఉంటాయి. అందుకే.. రష్యాకు చెందిన ఓ నటుడు హైదరాబాద్‌లోని ఎండను తట్టుకోలేక మృత్యువాత పడ్డాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న రష్యాకు చెందిన ఓ నటుడు హైదరాబాద్ ఎండను తట్టుకోలేక మృతి చెందాడు. ఈ ఘటన తాజాగా సంచలనం లేపింది.

syra narasimha reddy actor died with sun heat in hyderabad

రష్యాకు చెందిన అలెగ్జాండర్ అనే వ్యక్తి టూరిస్ట్ వీసా మీద గత మార్చి నెలలో హైదరాబాద్ వచ్చాడట. సైరా సినిమాలో అతడు నటిస్తున్నాడట. అయితే.. గచ్చిబౌలిలోని డీఎల్‌ఎఫ్ గేట్ వద్ద అతడు అపస్మారక స్థితిలో రోడ్డు మీద పడి ఉన్నాడట. అతడిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు.. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు. అతడు మృతి చెందాడు.

అతడి ఫోన్‌ను చెక్ చేయగా.. అందులో ఉన్న ఫోటోలను బట్టి అతడు సైరా సినిమాలో నటిస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు వెంటనే సైరా సినిమా యూనిట్‌కు ఈ విషయాన్ని చేరవేశారట. అలెగ్జాండర్ మృతి విషయం తెలుసుకున్న రామ్‌చరణ్ దిగ్భ్రాంతికి గురయ్యారట.

అయితే.. సైరా సినిమా షూటింగ్‌కు ముందు నుంచీ ఏవేవో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే కోకాపేటలోని చిరంజీవి ఫామ్ హౌస్‌లో వేసిన సెట్ కాలి బూడిదయిపోయింది. ఇప్పుడేమో రష్యా నటుడు మృత్యువాత పడ్డాడు. ఇలా అడ్డంకులు వస్తుండటంతో యూనిట్ కాస్త కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. అక్కడ బ్రిటీష్ సైన్యంపై నరసింహరెడ్డి తిరగబడే సీన్లను అక్కడ చిత్రీకరిస్తున్నారు.