బిగ్‌బాస్ 3లో పటాస్ యాంకర్ శ్రీముఖి..కన్ఫమ్ అట..?

శ్రీముఖిని కూడా బిగ్‌బాస్ 3 కోసం ఎంపిక చేసుకున్నారట నిర్వాహకులు. శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. లొడ లొడా వాగేస్తుంది. ఫుల్లు ఎంటర్ టైన్ మెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకొనే నిర్వాహకులు శ్రీముఖిని తీసుకున్నారని అంటున్నారు.

లొడలొడ వాగేయడంలో ముందు వరసలో ఉండే పటాస్ యాంకర్ శ్రీముఖి తెలుసు కదా. తనకు ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 లో చాన్ వచ్చేసిందట. త్వరలోనే బిగ్‌బాస్ సీజన్ 3 స్టార్ట్ కాబోతోంది. కంటెస్టెంట్ల సెలెక్షన్ కూడా నడుస్తోంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

Anchor srimukhi in bigg boss season 3

అయితే.. తాజాగా శ్రీముఖిని కూడా బిగ్‌బాస్ 3 కోసం ఎంపిక చేసుకున్నారట నిర్వాహకులు. శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. లొడ లొడా వాగేస్తుంది. ఫుల్లు ఎంటర్ టైన్ మెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకొనే నిర్వాహకులు శ్రీముఖిని తీసుకున్నారని అంటున్నారు.

అందుకే.. ఈ ముద్దుగుమ్మ.. పటాస్‌కు విరామం ఇచ్చిందట. బిగ్ బాస్ 3 కి సెలెక్ట్ అయింది కాబట్టే పటాస్‌కు కొన్ని రోజులు విరామం ఇచ్చిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మూడో సీజన్‌లో మొత్తం 17 మంది కంటెస్టెంట్లు పాల్గొంటారట. అఫిషియల్‌గా ఇంతవరకు షో నిర్వాహకులు ఎవరి పేర్లూ ప్రకటించలేదు కానీ.. కొందరి పేర్లయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్‌బాస్ సీజన్ 3 హోస్ట్ కూడా కన్ఫమ్ అయిపోయారు. ఈసారి మన్మథుడు, కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3కి హోస్ట్‌గా వస్తారని అంటున్నారు. అందుకే ఆయన మన్మథుడు2 షూటింగ్ పూర్తి చేసుకొని ఇటీవలే ఇండియా వచ్చారని.. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 3 కోసమే రెడీ అవుతున్నారని తెలుస్తోంది.