విజయ్ ‘బీస్ట్’ నుంచి బిగ్ అప్డేట్… ఈనెల 19న సెకండ్ సింగిల్

-

తలపతి విజయ్ ‘ బీస్ట్ ’ సినిమా సెకండ్ సింగిల్ కు ముహూర్తం ఖరారు అయింది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన ‘ అరబిక్ కుతు ’ సాంగ్ వరల్డ్ వైడ్ గా సూపర్ సక్సెస్ అయింది. ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ కు దగ్గర్లో ఉంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ లో ‘ అరబిక్ కుతు’ ఒకటి. భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ గా అరబిక్ కుతు సాంగ్ కి విశేష ఆదరణ లభించింది. విజయ్ డ్యాన్స్, పూజా హెగ్డే అందాలకు తోడు అనిరుధ్ మ్యూజిక్ తో సాంగ్ సక్సెస్ అయింది. ఈ సాంగ్ ను ప్రముఖ తమిళ హీరో శివకార్తికేయన్ రాయగా.. అనిరుధ్, జోనితా గాంధీ పాడారు. జానీ మాస్టర్ డ్యాన్స్ మరో అడ్వాన్టేజ్. 

తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ఈ నెల 19న విడుదల కానున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. దీనికి సంబంధించి ప్రోమోను కూడా విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఏకంగా 5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ‘జాలీ ఓ జింకానా’ అంటూ సాగే ఈ సాంగ్ ను విజయ్ పాడటం విశేషం. ప్రోమోలో హీరోయిన్ పూజాహేగ్డేతో పాటు డైరెక్టర్ నెల్సన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news