‘పుష్ప 2’ మూవీలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ !

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా తెర‌కెక్కిన తాజా సినిమా పుష్ప‌. ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించ‌గా.. బ‌న్నీ స‌ర‌స‌న ర‌శ్మిక మందాన హీరోయిన్ గాన‌టించింది. అయితే.. ఈ సినిమా గతేడాది డిసెంబ‌ర్ 17 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల అయింది. ఈ సినిమా పై పాజిటివ్ టాక్ రావ‌డంతో… జ‌నాలు ఎగ‌బ‌డి చూసారు.

అంతేకాదు… ఎవరూ ఊహించని కలెక్షన్లను కొల్లగొట్టింది పుష్ప. అలాగే ఈ సినిమాలో నటించిన నటీ నటులకు.. మంచి పేరు వచ్చింది. ఇక పుష్ప 2 సినిమా.. త్వరలోనే రానుంది. పార్ట్‌ 2 షూటింగ్‌ ఇంకా.. ప్రారంభం కాలేదు. అయితే.. పార్ట్‌ 2 లో కొత్త పాత్రలు వస్తాయని సమాచారం అందుతోంది.

ఈ సారి టాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన సీనియర్‌ హీరోయిన్‌ ఇంద్రజ ను పార్ట్‌ 2 లో దింపేందుకు దర్శకుడు సుకుమార్‌ సిద్ధం అయ్యారట. ఈ మేరకు ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. మరి ఈ మూవీలో హీరోయిన్‌ ఇంద్రజ నెగిటివ్‌ రోల్‌ చేస్తుందా ? లేక.. పాజిటివ్‌ రోలా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news