స్టార్ హీరోయిన్స్ కాజల్, తమన్నా ఓ క్రేజీ ఛాలెంజ్ లో పాల్గొని అభిమానులను అలరించారు. ఈ ఛాలెంజ్ కి సంబంధించిన వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ గా మారాయి.
సోషల్ మీడియా ద్వారా రైస్ బకెట్, ఐస్ బకెట్, కీకీ ఛాలెంజ్ అంటూ వినూత్న ఛాలెంజెస్ వరల్డ్ వరల్డ్ వైరల్ అయ్యాయి. సదరు ఛాలెంజెస్ పూర్తి చేసి ఔత్సాహికులు వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. సామాన్యులే కాకుండా సెలెబ్రిటీలు తమ ఫ్యాన్స్ కోసం ఇలాంటి సరదా ఈవెంట్స్ లో పాల్గొంటూ ఉంటారు. కొన్నాళ్లుగా వరల్డ్ వైడ్ షీ ఈజ్ ఏ 10(she’s a 10) అనే ఛాలెంజ్ వైరల్ అవుతుంది.
ఈ ఛాలెంజ్ అర్థం ఏమిటంటే అమ్మాయిల తమని తాము పర్ఫెక్ట్ అంటూ ఇతరులకు వివరించడమే. అది తమ అందానికి సంబంధించిన ఎత్తు, పొడుగు, రంగు, జుట్టు, బట్టలు,శరీర అవయవాల కొలతలు వంటి బాహ్య సౌందర్యం కావచ్చు. లేదా క్యారెక్టర్ వంటి అంతఃసౌందర్యం కావచ్చు. స్కేల్ లో పది అనేది అత్యున్నత ర్యాంక్. అంటే షి ఈజ్ ఏ టెన్ అంటే… ఓ అమ్మాయి విశ్వాసంతో తనకు తాను 10 కి 10 మార్కులు ఇచ్చుకున్నట్లు. ఈ ఛాలెంజ్ సెలెబ్రిటీలకు కూడా పాకింది.
మిల్కీ బ్యూటీ తమన్నా షీ ఈజ్ ఏ టెన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఆరంజ్ కలర్ ట్రెండీ వేర్ ధరించిన తమన్నా బాల్కనీలో కూర్చొని బుక్ చదువుతూ టీ తాగుతున్న వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోకి కామెంట్ గా ”మిస్ బి ఈజ్ 10. ఆనందానికి కొంత అమాయకత్వం కలిపాను. నా దేశీ హృదయానికి విదేశీ ఆనందం పంచుతున్నాను. షీ ఈజ్ ఏ 10 ఛాలెంజ్ నా బెస్ట్ ఫ్రెండ్ కాజల్ అగర్వాల్ కి విసురుతున్నాడు. ఈ ఛాలెంజ్ కి తన వర్షన్ చెప్పాలని కోరుకుంటున్నాను…” అని పోస్ట్ చేశారు.
ఇక తమన్నా ఛాలెంజ్ కి స్పందించిన కాజల్ ఆమె కోరిక ప్రకారం పూర్తి చేశారు. ఇంట్లో సోఫాలో కూర్చొని ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కాజల్… షీ ఈజ్ ఏ 10, కానీ ఆమె అమ్మ, కాబట్టి ఆమెకు పది ఇవ్వాల్సిందే. ఇది నా ఫ్రెండ్ తమన్నా కోసం.. అంటూ కామెంట్ చేశారు. ఓ తల్లిగా పరిపూర్ణత సాధించిన నేను 10 కి 10 సాధించినట్లే అన్న అర్థంలో షార్ట్ అండ్ స్వీట్ రిప్లై ఇచ్చింది కాజల్. తమన్నా, కాజల్ పరస్పరం స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
View this post on Instagram