ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తృటిలో త‌ప్పించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, జీవన్ రెడ్డిని పరామర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శుక్ర‌వారం జీవ‌న్ రెడ్డిని ప‌రామ‌ర్శించారు. హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని జీవ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లిన క‌విత‌… హ‌త్యాయత్నం, దాని నుంచి బ‌య‌ట ప‌డిన తీరును జీవ‌న్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఈ సంద‌ర్భంగా క‌విత‌ను చూసినంత‌నే జీవ‌న్ రెడ్డి స‌తీమ‌ణి భావోద్వేగానికి గుర‌య్యారు. దుఃఖం ఆపుకోలేక క‌విత ముందే క‌న్నీరు పెట్టుకున్నారు. దీంతో ఆమెనున ఓదార్చిన క‌విత‌… తాము అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, నేత‌ల‌కు పార్టీ వెన్నుద‌న్నుగా నిలుస్తుంద‌ని కూడా ఆమె జీవ‌న్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు తెలిపారు.