మగవారితో సంబంధం లేకుండానే బిడ్డ పుట్టే అవకాశం..ఎలాగంటే?

-

ఓ శిశువు జన్మించాలంటే మాత్రం ఆడ,మగ కలయిక తప్పనిసరి..ఇది ఒకప్పటి మాట..కానీ ఇప్పుడు అలా అవసరం లేదని చెప్తున్నారు..అదేలా సాధ్యం అనే సందేహం అందరికి వస్తుంది కదూ..అదేమిటో వివరంగా తెలుసుకుందాం….

సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నవారు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో రకరకాల చికిత్సలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కలయికతో సంబంధం లేకుండా.. ఐవీఎఫ్ పద్దతి ద్వారా కూడా చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు అవుతున్నాయి. అయితే.. ఈ పద్దతిలో.. శృంగారంతో సంబంధం లేకపోయినా… పురుషుల వీర్యం, స్త్రీ అండం తప్పనిసరి. అయితే.. తాజాగా చేసిన ఓ పరిశోధనలో.. అసలు పురుషుల వీర్యం లేకుండా.. పిండాన్ని అభివృద్ధి చేశారు.

నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఇజ్రాయిల్ దేశానికి చెందిన కొందరు శాస్త్రవెత్తలు.. ఈ రకం ప్రయోగాన్ని చేపట్టారు. కృత్రిమంగా పిండం తయారు చేయడమోలాగో వీరు ఆవిష్కరించారు. ఈ పద్దతిలో పురుషుల వీర్యంతో అసలు సంబంధమే ఉండదు. పురుషుల వీర్యంతో ఎలాంటి సంబంధం లేకుండా.. కృత్రిమ పిండాన్ని సృష్టించారు.. విచిత్రమెంటంటే ఈ పిండానికి తల్లి గర్భం కూడా అవసరం లేదు.అవునా..మరి ఎలా పిండం పెరిగింది అనే సందేహం వస్తుంది కదూ..అలా రావడం కామన్..

చిన్న పాత్రలో ఓ సింథటిక్ పొరను ఏర్పరిచి.. అందలోనే తల్లి గర్భంలోని వాతావరణాన్ని రూపొందించి.. కేవలం రక్త కణాలతోనే ఓ పిండాన్ని అభివృద్ధి చేశారు. ఇందులోనే కణజాలం వృద్ధి చెందడంతో పాటు.. శరీర భాగాలు కూడా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు..ఈ ప్రయోగానికి వీర్య కణాలతో కూడా సంబంధం లేదని చెప్పారు. ఇలా తల్లి గర్భం, తండ్రి వీర్యంతో సంబంధం లేకుండా కృత్రిమ పిండం రూపొందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా… మానవ కణజాలాన్ని, శరీర భాగాలను కృత్రిమ తయారు చేయడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.. మొత్తానికి ఈ వార్త సంచలనంగా మారడంతో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news