సైలెన్స్ అంటోన్న త‌మ‌న్నా..!

-

త‌మ‌న్నా గ్లామ‌ర్ పాత్రల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఓ వైపు గ్లామ‌ర్ రోల్స్ తోపాటు స్పెష‌ల్ సాంగ్స్ తో కుర్ర‌కారుని మెస్మ‌రైజ్ చేస్తుంది. మిల్కీ బ్యూటీగా త‌న హాట్ అందాల‌తో మ‌త్తెక్కిస్తుంది. అదే టైమ్‌లో ఇటీవ‌ల ఘోస్ట్ గానూ భ‌య‌పెడుతోంది. గ‌తంలో దేవిలో దెయ్యం త‌ర‌హా పాత్ర‌లో ఆడియెన్స్ ని వ‌ణికించింది.

tamanna hindi movie khamoshi first look

మ‌రోసారి భ‌య‌పెట్టేందుకు వ‌స్తోంది. దేవికి సీక్వెల్‌గా రూపొందుతున్న దేవి 2లో మ‌రోసారి ఘోస్ట్ గా న‌టిస్తుంది. ఇదిలా ఉంటే హిందీలో సూప‌ర్ నేచుర‌ల్ గా రూపొందుతున్న ఖామోషి చిత్రంలో న‌టిస్తుంది. వాయిదా ప‌డుతూ వ‌స్తోన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు రిలీజ్ కి రెడీ అవుతుంది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌మ‌న్నా పంచుకుంది.

ఇక్క‌డంతా నిశ్శ‌బ్ద‌మే అని పేర్కొంది. ఈ ఫ‌స్ట్ లుక్‌లో హర్ర‌ర్‌ని త‌ల‌పించేలా ఉంటూ, షాక్‌కి గురైన త‌మ‌న్నా లుక్, ఆపై ప్ర‌భుదేవా ముఖం స‌గం క‌నిపిస్తూ ఉంది. ఇది ఆద్యంతం సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఇందులో ప్ర‌భుదేవా విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. చక్రి తోలేటి ద‌ర్వ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 31న విడుద‌ల కానుంది. మ‌రి ఈ అందాల భామ ఆడియెన్స్ ని ఎంత‌గా భ‌య‌పెడుతుందో చూడాలి. దీంతోపాటు త‌మ‌న్నా ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి, ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి, త‌మిళంలో విశాల్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news