ఎన్నికల ఫలితాలు రాకముందే టీడీపీకి భారీ ఎదురుదెబ్బ.. వైసీపీ వైపు గెలిచే ఎమ్మెల్యేల చూపు..!

-

వైఎస్సార్సీపీ నేతలు ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే.. వెంటనే పార్టీ హైకమాండ్ కు తెలియజేయాలని.. పార్టీ అభ్యర్థులకు తెలిపారట కొంతమంది టీడీపీ ముఖ్యులు. అంతే కాదు.. కొంతమంది టీడీపీ అభ్యర్థులు కూడా తమపై పార్టీ అధినాయకత్వం నిఘా పెట్టిందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయట.

ఏం ఎన్నికలు రా బాబు. ఇంత టెన్షన్ ఏ ఎన్నికలకూ పడింది లేదు కాబోలు. ఎన్నికల ముందు ఒక టెన్షన్.. ఎన్నికల తర్వాత మరో టెన్షన్. ఫలితాల ముందు ఒక టెన్షన్.. ఫలితాల తర్వాత ఇంకో టెన్షన్. ఏం రాజకీయాలురా బాబోయ్. దేశమంతా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. ఏపీలో మాత్రం మాంచి రసవత్తరంగా ఉన్నాయి. ఎన్నికలు గత నెలలోనే పూర్తయినప్పటికీ.. ఫలితాలపై ఒక్కో పార్టీ ఒక్కో విధంగా అంచనా వేసుకుంటోంది.

some tdp winning candidates getting ready to join in ysrcp after results sources say

తాము గెలుస్తామంటే తాము గెలుస్తామంటూ ఎవరికి వాళ్లు డప్పుకొట్టుకుంటున్నారు. చివరికి.. మొన్న మొన్న వచ్చిన జనసేన పార్టీ కూడా తాము ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామంటోంది. అయ్య బాబోయ్.. ఎవరి గెలుపు మీద వాళ్లకు బాగానే నమ్మకం ఉంది.. కానీ.. టీడీపీకి ప్రస్తుతం ఓ సరికొత్త తలనొప్పి ప్రారంభమయిందట.

అదేంటంటే.. తాము తప్పకుండా గెలుస్తాం.. అని నమ్మకం ఉన్న టీడీపీ అభ్యర్థులు ముందే వైఎస్సార్సీపీలో కర్చీఫ్ వేసేసుకున్నారట. అవును.. వైఎస్సార్సీపీ నేతలతో కొంతమంది పక్కాగా గెలిచే ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారట. అదే ఇప్పుడు ఏపీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఏపీలో వచ్చేది ఎలాగూ జగన్ ప్రభుత్వమేనని.. ముందే తెలిసిపోయిందో ఏమో… పక్కా గెలుస్తాం అని నమ్మకం ఉన్న టీడీపీ అభ్యర్థులు ముందే వైఎస్సార్సీపీ నేతలతో సంబంధాలు నెరుపుతున్నారట. రేప్పొద్దున జగన్ ప్రభుత్వం రాగానే.. జంప్ కొట్టేయొచ్చని వాళ్ల ప్లాన్ అట. వైసీపీలోకి దూరితే.. ఏదో ఒక పదవి దక్కకపోదా అన్న చిన్న ఆశ. ఎలాగూ టీడీపీ ఓడిపోయే పార్టీ… దాంట్లో ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే లేకున్నా.. ఒకటే.. అన్న భావనతో ఉన్నారట కొంతమంది అభ్యర్థులు.

ఈ విషయం టీడీపీ హైకమాండ్ కు కూడా తెలిసిందట. దీంతో పక్కగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు.. వైసీపీ వైపు చూసే అభ్యర్థులపై పార్టీ హైకమాండ్ ఓ కన్నేసి ఉంచిందట. ప్రతి జిల్లా వారీగా నివేదికలు కూడా పార్టీ హైకమాండ్ కు అందాయట. ఎవరు గెలవబోతున్నారు.. గెలిస్తే.. ఇటు ఉంటారా? లేక వైసీపీలోకి వెళ్తారా? ఎంతమంది వైసీపీ వైపు చూస్తున్నారు.. అనే లెక్కలన్నీ చంద్రబాబు టేబుల్ మీదికి వచ్చేశాయట.

వైఎస్సార్సీపీ నేతలు ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే.. వెంటనే పార్టీ హైకమాండ్ కు తెలియజేయాలని.. పార్టీ అభ్యర్థులకు తెలిపారట కొంతమంది టీడీపీ ముఖ్యులు. అంతే కాదు.. కొంతమంది టీడీపీ అభ్యర్థులు కూడా తమపై పార్టీ అధినాయకత్వం నిఘా పెట్టిందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయట. ఏది ఏమైనా… ఎన్నికల ఫలితాలు వెలువడితే కానీ.. ఏదీ ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. చూద్దాం.. మే 23న ఏం జరుగుతుందో. భూగోళం అయితే బద్దలు కాదు కదా.

Read more RELATED
Recommended to you

Latest news