బాయ్​ఫ్రెండ్​తో డేట్​కు వెళ్లి కెమెరాకు చిక్కిన తమన్నా

-

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో కలిసి కొంతకాలంగా రిలేషన్​షిప్​లో ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ఊతమిస్తూ ఈ జంట న్యూ ఇయర్ వేడుకల్లో కిస్ చేసుకుంటూ కెమెరాకు చిక్కడంతో అది నిజమేనని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ జంట అప్పుడప్పుడు ముంబయి వీధుల్లో కలిసి కనిపిస్తూ.. కేవలం ప్రొఫెషనల్ పరంగానే మీట్ అవుతున్నట్లు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా తమన్నా.. విజయ్​లు డిన్నర్ డేట్​కు వెళ్లి బీ టౌన్ కెమెరాలకు చిక్కారు.

సోమవారం రోజున ముంబయిలోని ఓ రెస్టారెంట్​కు వెళ్లిన ఈ జంట తిరిగి వెళ్తున్న సమయంలో కెమెరాకు చిక్కింది. అయితే వారు మీడియాకు హాయ్​ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో త్వరలోనే వీరు తమ రిలేషన్ గురించి బయటపెడుతుందన్న ఆతృతతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్​లో తెరకెక్కుతున్న ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగ్​లో వీళ్లిద్దరికీ పరిచయం అయ్యిందని, అక్కడే వీరు ప్రేమలో పడ్డారని బీ టౌన్​లో టాక్​.

Read more RELATED
Recommended to you

Latest news