మిల్క్ బ్యూటీ తమన్న ఎట్టకేలకు తన ప్రేమ రహస్యాన్ని చెప్పేసిందని చెప్పాలి. తాను విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..తాజాగా అతనితో కలిసి ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమలో పడ్డారన్న విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఆమె నటుడు విజయ్ వర్మతో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.
2023 న్యూ ఇయర్ వేడుకలలో ఈ జంట చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఈ వార్తలను అప్పుడు తమన్నా ఖండించారు. నేను ఎవరితో డేటింగ్ చేయడం లేదు సింగిల్ అంటూ సమాధానం చెప్పారు. కానీ ఆమె చేసే పనులు మాత్రం అనుమానాధాస్పదంగా ఉన్నాయి. ఇటీవల మరొక సారి తమన్నా, విజయవర్మ కలసి కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులో డిన్నర్ నైట్ కి వెళ్తూ కెమెరా కంటికి చిక్కడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అన్ని జరిగిపోయాయి. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.
ఇకపోతే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది తమన్నా . తాజాగా లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ మొదలైంది అని కేవలం సహానటుడు అనే కారణంగా విజయవర్మను ఇష్టపడలేదు. నేను చాలామంది హీరోలతో పని చేశాను కానీ విజయవర్మ చాలా ప్రత్యేకం… నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మాది ఆర్గానిక్ బంధం.. నన్ను దెబ్బతీయాలని చూసేవారి నుండి నన్ను రక్షించాడు. నాకోసం నేను నిర్మించుకున్న అందమైన ప్రపంచంలోకి విజయ వర్మ వచ్చాడు. అతను ఉన్న ప్రదేశమే నాకు ఇష్టమైన ప్రదేశం అంటూ తన ప్రేమపై ఓపెన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.