TanuSri Dutta: హీరోయిన్‌ కార్‌కు యాక్సిడెంట్..మోకాలికి తీవ్ర గాయం..

-

బీ టౌన్ హీరోయిన్ కారుకు యాక్సిడెంట్ అయింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..‘ఆషిక్‌ బనాయా ఆపనే’, ‘36 చైనా టౌన్‌’ ఫిల్మ్స్ ఫేమ్ తనూశ్రీ దత్తా…ఆమె రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

ప్రమాదంలో మోకాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలతో పాటు యాక్సిడెంట్ అయిన విషయాన్ని తనూ శ్రీ దత్తా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టులో పేర్కొంది.

మహాకాళ్‌ దేవాయానికి బయలు దేరిన క్రమంలో మార్గం మధ్యలో తను ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయని వివరించింది. ఈ ప్రమాదంలో తన కాలికి తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపింది తనూశ్రీ దత్తా.

సదరు ఇన్ స్టా గ్రామ్ పోస్టులో తన జీవితం సాహసోపేతమైనదని, గుడికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని తనూ శ్రీ దత్తా తెలిపింది. తనకు ప్రమాదం జరిగినప్పటికీ ఫస్ట్ ఎయిడ్ చేసుకుని మరి మహాకాళి దర్శనానికి వెళ్లానని స్పష్టం చేసింది తనూ శ్రీ దత్తా. ‘‘జై మహాకాళ్ ’’ అని పోస్టులో క్యాప్షన్ ఇచ్చింది హీరోయిన్ తనూ శ్రీ దత్తా. ప్రమాదం నుంచి సురక్షితంగా తనూ శ్రీ దత్తా బయటపడటం మహాకాళి మహిమేనని నెటిజన్లు అంటున్నారు. ఈమె తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ‘వీరభద్ర’ చిత్రంలో ఈమె నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news