శ్రీమతికి అపురూపమైన బహుమానం ఇచ్చిన తారక్.. అదేంటంటే?

-

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. నెక్స్ట్ ఫిల్మ్ NTR30 కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ఇచ్చేశారు. ఆ నెక్స్ట్ మూవీ కూడా క్రేజీ లైనప్ గా ఉంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ లో తారక్ ..తన 31 వ సినిమా చేస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..తారక్..తన ఫ్యామిలీకి ఫుల్ ప్రయారిటీ ఇస్తారు.

NTR Anil Ravipudi movie is on Cards

ఫిల్మ్స్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తారక్..తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతికి తాజాగా అపురూపమైన బహుమానం ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ కుటుంబం, పిల్లల బాధ్యతలు చూసుకుంటుంది లక్ష్మీ ప్రణతి.

లక్ష్మీ ప్రణతి అంటే తారక్ కు అమితమైన ప్రేమ అని అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఆమెకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారట. గతేడాది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం గోపాలపురం గ్రామ పరిధిలో ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు తారక్.

దానిని ఫామ్ హౌజ్ గా మార్చిన తారక్..తన భార్యకు కానుకగా ఇచ్చారని సమాచారం. పుట్టినరోజు సందర్భంగా ఫామ్ హౌజ్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. ఈ ఫామ్ హౌజ్ కు తారక్..‘బృందావనం’ అనే పేరు పెట్టారు. తన సూపర్ హిట్ ఫిల్మ్ పేరును ఈ ఫామ్ హౌజ్ కు పెట్టడం తెలుసుకుని నందమూరి వంశ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news