చరణ్, రానా, అనిరుధ్‌తో ఐలాండ్‌కు తారక్.. ఎందుకో తెలుసా?

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతకు మునుపు ఎన్నడు లేని విధంగా జరిగాయని చెప్పొచ్చు. డైరెక్టర్, హీరోలు దేశవ్యాప్తంగా పలు నగరాలతో పాటు విదేశాలకు సైతం వెళ్లి అక్కడా చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్‌కు ఒక్క రోజు ఉన్నప్పటికీ ఆ ముందు రోజు కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో ప్రచార కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తాజాగా తెలుగు మీడియా చానల్స్‌కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటంటే..‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర విశేషాలను మూవీ యూనిట్ సభ్యులు ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా మీడియా ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ పూర్తయ్యే టైంలో యాంకర్స్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ పెడుతుంటారు. కాగా, ఓ టీవీ చానల్ వారు డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు. మీరు ఒక ముగ్గురిని తీసుకుని ద్వీపకల్పంలో ఉండాల్సి వస్తే వారు ఎవరెవరు? అనే ప్రశ్నను జూనియర్ ఎన్టీఆర్‌ను అడిగారు.

ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ తారక్ సమాధానమిచ్చాడు. ఆ ద్వీపకల్పంలో తనతో పాటు చరణ్, రానా, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఉండాలని చెప్పాడు. తాను ఎలాగూ చెఫ్ కాబట్టి ఐలాండ్‌లో కావల్సిన వంటలు అందరికీ చేసి పెడ్తానని పేర్కొన్నాడు.

అక్కడ బోరు కొట్టకుండా ఉండటానికి అనిరుధ్ ఉంటే సంగీతం కంపోజ్ చేస్తాడని, పాటలు పాడుతాడని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఆ ఐలాండ్‌కు రాజమౌళి వద్దని పేర్కొన్న తారక్.. ఎలాగూ తాము ఐలాండ్ నుంచి ఎప్పుడు బయటకు వస్తామా? అని అప్పటి వరకు జక్కన్న వెయిట్ చేస్తాడని చెప్పాడు. అలా ఇంటర్వ్యూ ఫన్నీగా ముగిసింది.