టీజర్: ఈ సినిమాతో నైనా అల్లు శిరీష్.. అను ఇమ్మానుయేల్ సక్సెస్ అయ్యేరా..?

-

అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఇప్పటికే పాన్ ఇండియన్ హీరోగా పేరుపొందారు. ఇక తన అన్న బాటలోనే అల్లు శిరీష్ హీరోగా ఎంతగానో నటించనప్పటికీ ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు. మొదట గౌరవం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు శిరీష్ ఆ తరువాత వరుస సినిమాలు చేసిన ఫ్లాప్ గానే మిగిలాయి. ఈ క్రమంలోని శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మరొక సినిమాలో నటించబోతున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలై ఇప్పటికీ కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక దీంతో వీరిద్దరూ క్లోజ్మెంట్ చేసి వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లుగా కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. అయితే మొదట ఈ సినిమాకు ప్రేమ కాదంటారా అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ ఊర్వశివో రాక్షసివో అనే టైటిల్ ని మార్చారు.

ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేశారు. టీజర్ లోని సన్నివేశాలు రొమాంటిక్ సన్నివేశాలతో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే యువతను ఎక్కువగా ఆకర్షించే విధంగా ఉన్నది. ఈ చిత్రంలో పోసాని కూడా నటిస్తున్నారు. ఈ సినిమాతో అల్లు శిరీష్,అను ఇమ్మాన్యుయెల్ సక్సెస్ అవుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...