ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్‌ ఎన్నిక

-

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్ష ఎన్నికలు ఇవాళ జరిగాయి. ఈ ఎన్నికల్లో ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ ఛాంబర్‌ అధ్యక్షుడిగా పని చేసిన దిల్‌రాజు పదవీ కాలం ఈనెల 31వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (జులై 28వ తేదీ 2024) ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి ఠాగూర్‌ మధు, భరత్‌ భూషణ్‌ పోటీ పడ్డారు. ఉపాధ్యక్ష పదవికి అశోక్‌కుమార్‌, వైవీఎస్‌ చౌదరి మధ్య పోటి జరగగా..  అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్‌, ఉపాధ్యక్షుడిగా అశోక్‌ కుమార్‌ గెలిచారు. దాదాపు 46 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 29 మంది సభ్యులు భరత్ భూషణ్కు అనుకూలంగా, 17 మంది ఠాగూర్ మధుకు మద్దతుగా ఓటు వేశారు.

మెజార్టీ కంటే అధిక ఓట్లు రావడంతో భరత్ భూషణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అటు ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ , వైవీఎస్ చౌదరి పోటీ పడగా సభ్యులు అశోక్ కుమార్ ను ఛాంబర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన వారికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news