వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు.
వారసుడు సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం స్టార్ట్ చేసింది. ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఇటీవలే రంజితమే సాంగ్ ను రిలీజ్ చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాట ఇప్పటివరకు 70 మిలియన్ల వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ అయింది. అయితే ఈ సాంగ్ కేవలం తమిళ భాషలోనే రిలీజ్ అయింది. కాగా చిత్రబృందం తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ పాటను నవంబర్ 30న ఉదయం 9:09 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటన వచ్చింది. తమిళ వెర్షన్ ను హీరో విజయ్, ఎమ్. ఎమ్ మానసితో కలిసి ఆలపించాడు. కాగా తెలుగు వెర్షన్ ను అనురాగ్ కులకర్ణి పాడనున్నాడు.