ఆ ఒక్క సాంగ్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిందిగా…..!!

-

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ఆయన 26వ సినిమా అయిన సరిలేరు నీకెవ్వరూ మూవీ పై ఇప్పటికే అంచనాలు బాగా ఉన్నాయి. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన నాలుగు సాంగ్స్ కు కొంత మిక్స్డ్ గా రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మాత్రం విశేషమైన స్పందన లభించింది అనే చెప్పాలి. జనవరి 5న జరుగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇక నిన్న విశాఖపట్నంలో జరిగిన విశాఖ ఫెస్ట్ లో భాగంగా సరిలేరు టీమ్ ఒక చిన్న మ్యూజిక్ ఈవెంట్ ని కండక్ట్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు అనిల్ సుంకర, శిరీష్, నటుడు రాజేంద్ర ప్రసాద్,

సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఇదే ఈవెంట్ లో డ్యాంగ్ డ్యాంగ్ అనే పల్లవితో సాగె మాస్ బీట్ సాంగ్ వీడియో ప్రోమోని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఆ ప్రోమోలో మహేష్ తో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా తన డాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టింది. సోల్జర్స్ మధ్య, వారికి మంచి కిక్ ఇస్తూ, సినిమాలోని మంచి మూమెంట్ లో ఈ సాంగ్ వస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి అంటున్నారు. ఇక సాంగ్ లో తమన్నా తో పాటు సూపర్ స్టార్ మహేష్ కూడా తన స్టెప్స్ తో ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు అనే చెప్పాలి.

ప్రస్తుతం అత్యధిక వ్యూస్ తో యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో ప్రోమో సాంగ్ రిలీజ్ తరువాత, సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు తారా స్థాయికి చేరాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కొన్నేళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని జనవరి 11న రిలీజ్ చేయనున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news