ఏపీలో మూడు రాజధానులపై.. కేటీఆర్ కామెంట్..

-

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై మంత్రి, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కె.తారకరామారావు స్పందించారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్‌లో ఆయన #AskKTR పేరుతో నెటిజన్లతో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఏపీలో మూడురాజధానుల అంశంపై కేటీఆర్ అభిప్రాయాన్ని చెప్పాలని కోరారు. ‘మీరు తెలంగాణకు చెందిన వారు కాదని కొన్ని సెకన్ల పాటు మర్చిపోండి. ఓ భారతీయ పౌరుడిగా ఏపీలో మూడు రాజధానుల అంశం మీద మీ సమాధానం చెప్పండి.

రాజధాని నగరం, హైకోర్టు ఏర్పాటు అంటే అభివృద్ధేనా?’ అని నెటిజన్ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ కామెంట్ చేశారు. ‘ఆ తీర్పు చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నేను కాదు.’ అని స్పందించారు. మ‌రోవైపు ఏపీ సీఎం జగన్ పాలనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఏపీలో 6 నెలల్లో జగన్‌ పరిపాలన బాగుందని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news