పవన్ కల్యాణ్ ని నమ్మి బొక్కబోర్లా పడబోతున్న ఆ ప్రొడ్యూసర్ ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు దిల్ రాజు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన హీరోలకు ఇస్తున్న రెమ్యూనరేషన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలైన మహేష్ మరియు పవన్ కళ్యాణ్ ఇంకా ఇతర హీరోలు సినిమాకి 25 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కలెక్ట్ చేస్తూ మరో పక్క సినిమా లాభాల్లో కూడా వాటాలు తీసుకుంటున్నారు.

ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో తన కోరిక అంటూ చాలా సందర్భాలలో ఆడియో వేడుకలలో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా హీరోల కు సంబంధించిన సినిమా వేడుకలలో తన కోరిక బయట పెట్టిన ప్రొడ్యూసర్ దిల్ రాజు చివరాకరికి పవన్ కళ్యాణ్ తో ‘పింక్’ రీమేక్ చేయడానికి రెడీ అయిన సంగతి అందరికీ తెలిసినదే.

 

బాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా రీమేక్ హక్కులను పొందుకున్న దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నాడు. అయితే సినిమా ఓవరాల్ గా నిర్మాణం కన్నా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న దిల్ రాజు సినిమాకి సంబంధించి షూటింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఉన్న కొద్ది ఆలస్యం చేస్తుండటంతో ఆర్థికంగా దిల్ రాజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పవన్ కళ్యాణ్ ని నమ్మి అనవసరంగా సినిమాకి కమిట్ అయినట్లు లోలోపల ప్రొడ్యూసర్ దిల్ రాజు బాధపడుతున్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.