చిరంజీవి, రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రం ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. సంగీతాన్ని మాత్రం మణిశర్మ అందించారు. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే కూడా నటించింది. ఇక ఈ చిత్రం కోసం ఒక టెంపుల్ టౌన్ సెట్టింగ్ కూడా వేయడం గమనార్హం. అత్యధిక ఖర్చుతో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం గురించి ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కొన్ని విషయాలు తెలిపారు వాటి గురించి చూద్దాం.
ఆచార్య సినిమాను రీసెంట్ గా తాను చూశానని అందుకే ఇప్పుడు ఈ చిత్రం గురించి నేను మాట్లాడుతున్నానని ఈ సినిమా చూస్తుంటే ఎన్నో ఏళ్ల క్రితమే మేము రాసిన మరో మలుపు అనే చిత్రం తమకు గుర్తుకు వస్తోందని తెలిపారు. ఆ చిత్రంలో కూడా ఆలయాల దోపిడీ నక్సలైట్ గా శివకృష్ణ నటించారు.. ఇక ఈ సినిమాలో కూడా పాదఘట్టం, ధర్మస్థలి జీవనధార సాక్షిగా ఈ సినిమా కథ నడుస్తుంది. 1990వ సంవత్సరంలో ఎక్కువగా ఎర్ర సినిమాలు వచ్చాయి దీంతో ఆ తర్వాత సినిమాలు రాయడం మానేశామని తెలియజేశారు.ఇక ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలకు డైరెక్టర్ కొరటాల శివ చిరంజీవి కలిసి ఎర్ర సినిమాను తెరకెక్కించడం చాలా గొప్ప విషయమని తెలిపారు. కానీ ఈ సినిమా తెరకెక్కించేటప్పుడు ఎందుకు జరిగింది ఏం జరిగింది అనే విషయాన్ని తెలియకుండానే కథను చూపించారు. దీంతో ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు. ఆ ప్రభావం సినిమా పైన చాలా పడింది. అందుచేతనే ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది అని తెలిపారు. ఇక రాంచరణ్ పాత్రను మొదటి భాగంలో అక్కడక్కడ చూపించి ఉంటే బాగుండేది కానీ సెకండ్ హాఫ్ వరకు దాచేయడం వలన ఈ సినిమా సరిగ్గా ప్రేక్షకులకు ఎక్కలేదు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ వారికి నక్సలైట్ కి సంబంధించిన సినిమాలు ఎక్కడం లేదు. అందుచేతనే ఈ సినిమా ప్లాప్ కి కారణమని చెప్పవచ్చు అని తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటించకపోయి ఉంటే బాగుండేదని తన భావనగా తెలిపారు. అయితే ఒక పని చేయడానికి ఇద్దరు స్టార్ హీరోలు అవసరం లేదనేది తన భావన అన్నట్లుగా తెలిపారు.