ఇదేం విడ్డూరం.. బిల్లు రూ.20.. టాక్స్‌ రూ.50..

-

మనం కొన్ని కొన్ని సార్లు కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు కాఫీకో, టిఫిన్‌కో సంబంధించి భారీ డబ్బులు వసూలు చేసిన విషయాలను చూసే ఉంటాం. అయితే ఇలాంటి ఘటనలు ఏదో రెస్టారెంట్లనో లేక హోటళ్లనో జరిగితే దానికి యాజమాన్యంది బాధ్యత వహిస్తుంది. కానీ.. ఇప్పుడు ఈ ఘటన ప్రభుత్వం రంగ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీలో చోటు చేసుకుంది. వినోద్ వర్మ అనే ప్రయాణికుడు జూన్ 28న ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించాడు. రైలులో టీ తాగాలనిపించి ఆర్డర్ చేస్తే ఏకంగా రూ. 70 బిల్లు చేతిలో పెట్టారు. అందులో టీకి రూ. 20, సర్వీస్ చార్జ్ రూ. 50గా పేర్కొనడంతో వినోద్ వర్మ ఆశ్చర్యపోయాడు.

Shatabdi Express rail passenger pays service charge of Rs 50 on tea worth Rs 20, IRCTC faces backlash

వెంటనే ఆ బిల్లును ఫొటో తీసి ట్వీట్ చేశాడు. ‘రూ. 20 టీకీ రూ. 50 సర్వీస్ చార్జీనా?.. మరీ ఇంత దోపిడీనా?’ అని వాపోయాడు వినోద్‌. ఇది చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. రైలులో టీకి ఐదు రూపాయలే ఎక్కువని కామెంట్ చేస్తున్నారు. సర్వీస్ చార్జ్ వసూలు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల రెస్టారెంట్లకు జారీ చేసిన ఆదేశాల క్లిప్పింగులను మరికొందరు షేర్ చేస్తున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ప్రయాణికుడి నుంచి తాము అదనంగా ఎలాంటి మొత్తమూ వసూలు చేయలేదని వివరణ ఇచ్చారు. రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్ చేసుకోకుండా ప్రయాణ సమయంలో బుక్ చేస్తే రూ. 50 సర్వీస్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుందంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news