అందుకే బిగ్ బాస్ దివిపై కేసు పెట్టాలన్న నెటిజెన్..!!

-

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఇకపోతే ఈ షో ద్వారా కొంతమందికి మంచి జరిగితే మంచి మరి కొంతమందికి చెడు జరిగిందని చెప్పాలి. ఇకపోతే ఈ బిగ్ బాస్ షో ద్వారా లాభపడిన సెలబ్రిటీలలో దివి కూడా ఒకరు. ఇక ఈమెకు వరుస సినిమా ఆఫర్లు రావడంతో తనను అభిమానించే అభిమానులు కూడా పెరిగిపోతున్నారు. ఇక తన అందంతో, చలాకీతనంతో, చురుకుగా ఉండే దివిని చూసి ఎవరైనా సరే ఇట్టే ఆకర్షితులవుతారు అనడంలో సందేహం లేదు. ఇక సినిమాలలో కూడా తన నటనతో చెరగని మార్క్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది దివి.

ఇక తరచూ కూడా తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా ఎప్పటిలాగే సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయగా
సదరు నెటిజన్ దివి షేర్ చేసిన ఫోటోలను చూస్తూ దివి “కేసు పెట్టండి సర్.. అందంతో చంపేస్తోంది కచ్చితంగా ఈమె పై కేసు పెట్టండి” అంటూ కామెంట్ చేశాడు. ఇక అందాలతో మత్తెక్కిస్తూ కవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తూ తెగ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా తన అందంతో చూపరులను ఆకట్టుకుంటున్న దివికి సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.

కానీ గుర్తింపు తీసుకొచ్చేంత పెద్ద ఆఫర్లు అయితే ఏవి రాలేదని చెప్పాలి. ఇక ఈమె కెరియర్ పరంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవకాశాలను సరిగా అందిపుచ్చుకోవడంలో ప్రయత్నం విఫలమవుతుంది. ముఖ్యంగా ఇతరులకు గౌరవం ఇచ్చే అతి కొద్ది మంది సెలబ్రిటీలలో దివి కూడా ఒకరు. ఇక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పారితోషకం విషయంలో కూడా ఇచ్చింది తీసుకుంటూ తన నటనను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దివి.

Read more RELATED
Recommended to you

Latest news