తెలంగాణ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు.. సీఎం కేసీఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మెగా కృష్ణారెడ్డి రూ.70 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి రూ.12 వేల కోట్లు జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని తెలిపారు. దీనికి జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. మీరిద్దరు తోడు దొంగలనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏలాంటి ప్రాజెక్ట్ చేపట్టినా.. మెగా కృష్ణారెడ్డికే ఎందుకు కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నారని పేర్కొంది.
తెలంగాణలోని మిగిలిన కాంట్రాక్టర్లకు పనులు తెలియవా.. లేక ఇద్దరు కలిసి ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. అయితే ఈ విషయంపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. మెగా కృష్ణారెడ్డి మీ ఇద్దరికీ కూడా స్నేహితుడా అని ఆరోపించారు. మీకు కూడా ముడుపులు అందించాడా అని తెలిపారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వైఎస్ షర్మిల ఆరోపణల వీడియో వైరల్ అయింది.
మెగా కృష్ణారెడ్డి రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని.. ఇందుకు సంబంధించి రూ.12వేల కోట్ల GST కట్టాల్సి ఉంటుందని స్వయంగా GST ఇంటెలిజెన్స్ చెబుతున్నా KCR ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.మీ ఇద్దరు తోడు దొంగలనా? రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే
1/2 pic.twitter.com/eRqG7rkLy9— YS Sharmila (@realyssharmila) July 23, 2022