నందమూరి హీరోల ఘనత.. ఆ డైరెక్టర్లను స్టార్స్​ చేసింది ఈ హీరోలే!

-

నందమూరి హీరోలు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తెలుగు ఇండస్ట్రీలో ఓ ఘనత సాధించారు. సినిమా సినిమాకు వీరు చేస్తున్న ప్రయోగాల వల్ల టాలీవుడ్​కు స్టార్ డైరెక్టర్లు దొరుకుతున్నారు.

వీరి సినిమాలతో వచ్చిన దర్శకులు ప్రస్తుతం బడా హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్​లో కొనసాగుతున్నారు. ఆ సంగతులేంటో తెలుసుకుందాం…

నందమూరి కల్యాణ్​రామ్​​ ఇటీవలే ‘బింబిసారుడి’గా వచ్చి బాక్సాఫీస్​పై యుద్ధం చేసి చారిత్రక విజయాన్ని అందుకున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడిగా పనిచేసిన వశిష్ఠ ప్రస్తుతం ప్రస్తుతం స్టార్​స్టేటస్​ను అందుకున్నారు. ఇప్పడాయనికి వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్​లు ఉన్నాయి.

అయితే అంతకుముందు కూడా కల్యాణ్​ సినిమాతో దర్శకులుగా పరిచయమైనవారు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్​ హోదాలో కొనసాగుతున్నారు. ‘అతనొక్కడే’ చిత్రంతో సురేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ మూవీ సురేందర్ రెడ్డికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలతో ప్రముఖ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్​తో భారీ స్థాయిలో ‘ఏజెంట్’ను రూపొందిస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ, ఫ్యామిలీ కంటెంట్​తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్​ను అందుకుంటున్నారు. అనిల్ కేరీర్ కూడా కల్యామ్​రామ్ నటించిన ‘పటాస్’ మూవీతోనే ప్రారంభమైంది. తన టాలెంట్​తో ‘ఎఫ్2, ఎఫ్​ 3’, ‘సరిలేరు నీకెవ్వరూ’ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి.. స్టార్ డైరెక్టర్ లిస్ట్​లో చేరిపోయారు. త్వరలోనే నందమూరి హీరో బాలకృష్ణతో ఓ మూవీ చేయనున్నారు.

ఇక టాలీవుడ్​ డైరెక్టర్స్​ కా బాప్​ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమానే శాసించే స్థాయిలో ఉన్నారు. ఆయన కేరీర్ ఎన్టీఆర్​ ‘స్టూడెంట్ నెంబర్ వన్’తో మొదలైంది. తొలి మూవీతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి దర్శకుడిగా తొలి సక్సెస్​ను అందుకున్నారు. డెబ్యూ దర్శకుడిగా ఎన్టీఆర్ రాజమౌళికి కల్పించిన ఈ అవకాశం.. జక్కన శ్రమ, ప్రతిభ.. ఆయన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చి ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘ఆర్​ఆర్​ఆర్’​ సంచలనాలు సృష్టించాయి.

తారక్ నటించిన ‘ఆది’ చిత్రంతో వీవీ వినాయక్ యాక్షన్​ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో టాలీవుడ్ డైరెక్టర్​గా మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’, ‘దిల్’, ‘ఠాగూర్’, ‘బన్నీ’, ‘అదుర్స్’, ‘ఖిలాడీ నెంబర్ వన్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించిన వీవీ వినాయక్ కూడా ప్రస్తుతం స్టార్ స్టేటస్​లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడాయన బెల్లంకొండ శ్రీనివాస్​తో హిందీలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్​ చేస్తున్నారు. ఈ మూవీ బాలీవుడ్​ అరంగ్టేట్రేం చేయనున్నారు.

కాగా, కొత్త టాలెంట్​ను గుర్తించి అవకాశాలు ఇస్తూ.. వారికి స్టార్ డైరెక్టర్లుగా మారే అవకాశం ఇస్తున్న నందమూరి హీరోలపై అభిమానులు, సినిమాకు చెందిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news