మే 6వ తేదీన ఓటీటీలో “ది కాశ్మీర్ ఫైల్స్” రిలీజ్

-

ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఫీవర్ నడుస్తోంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 1990ల్లో కాశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, అత్యాచారాలు, ఓ వర్గం సాగించిన దమనకాండ, వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది.

కాశ్మీర్ లో పండిట్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, తన ఇళ్లు, స్థలాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి అంశాలు ప్రేక్షకులతో కంటతడిపెట్టిస్తున్నాయి. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవరిలు ప్రధాన పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న “ది కాశ్మీర్ ఫైల్స్ ” మూవీ ఓటిటీ రైట్స్ ను జీ 5 సొంతం చేసుకుంది. మార్చి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా నాలుగు వారాల తర్వాత ఓ టి టి లో స్ట్రీమింగ్ చేయాలని భావించారు. అయితే సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా మరికొంతకాలం థియేటర్లోనే ఉంచి మే ఆరో తేదీన రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news