‘ది కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ కు సెక్యురిటీ టైట్…. ‘వై కేటగిరి’ సెక్యురిటీ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం..!

-

దేశవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తున్న సినిమా పేరు ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ . 80,90ల్లో కాశ్మీర్ నుంచి పండిట్లను తరిమేయడంతో పాటు ఆ సమయంలో చోటు కాశ్మీర్ పండిట్లు, హిందువులపై జరిగిన అత్యాచారాలు, దమనకాండపై, పండిట్లు ఎదుర్కొన్న భయానక పరిస్థితులపై తీసిందే ‘ ది కాశ్మీర్ ఫైల్’ సినిమా. ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతోంది. రూ. 200 కోట్లు కలెక్ట్ చేసే దిశగా సినిమా వెళ్తోంది. ప్రధాని మోదీతో పాటు, హోంమంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల బీజేపీ పార్టీ నేతలు సినిమాను పొగుడుతున్నారు.

దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో పాటు నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ నటనను పొగుడుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని వర్గాల నుంచి ఈ సినిమాపై వ్యతిరేఖత వస్తోంది. ముఖ్యంగా లెఫ్ట్ వింగ్ పార్టీలు సినిమాను వ్యతిరేఖిస్తున్నారు. ఇదిలా ఉంటే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి ‘వై కేటగిరి’ సెక్యురిటీ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. సీఆర్ఫీఎఫ్ తో కూడిన సెక్యురిటీతో కూడిన ‘వై కేటగిరి’ని ఇండియా వ్యాప్తంగా వివేక్ అగ్రిహోత్రికి కల్పించాలని నిర్ణయించింది. 

Read more RELATED
Recommended to you

Latest news