రేలంగి నరసింహారావు తెలుగు సినిమాలో దర్శకుడిగా పనిచేసే ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ , పోలీస్ భార్య, సుందరి సుబ్బారావు వంటి అనేక కామెడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రేలంగి నరసింహారావు గారికి ఒక సుస్థిర స్థానం ఉండేలా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు కానీ గతంలో సినిమా ఇండస్ట్రీ తో ఎటువంటి సంబంధం లేని రోజుల్లో సినిమాల్లోకి వెళ్లాలని చాలా ఉండేది. అప్పుడు ఏం చేయాలో తెలియక తన కుటుంబానికి దగ్గర వాడైనా దాసరి దగ్గరకు నేరుగా వెళ్లి సినిమా అవకాశాల కోసం అడగడం మొదలుపెట్టారు.
దాసరి 1972లో తొలి సినిమా అయినా తాతా-మనవడు అనే చిత్రానికి దర్శకత్వం వహించి అది విడుదలవగా మంచి హిట్ అయింది. అదే నిర్మాణ సంస్థ అయినా ప్రతాప్ బ్యానర్లో సంసారం సాగరం అనే మరో సినిమా తీయాలని ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కే రాఘవ అలాగే దాసరి నిర్ణయించుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయాలని ఉద్దేశంతో దాసరిని అడగగా ఆయన ఓకే అని ,ఒక రోజు నేరుగా రాఘవ గారి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే ఇంటి ముందున్న గార్డెన్లో ఆయన కూర్చొని ఉన్నారు.. రేలంగిని రాఘవగారు పైనుంచి కింద వరకు చూసి లోపలికి వెళ్లి మా గురువు గారికి ఒక కుర్చీ తీసుకురా అని ఆదేశించారు. దాంతో దాసరి గారు కంగారు పడ్డారు .ఎందుకంటే రేలంగి అప్పటికే స్థితిమంతుడు. ఇక ఆయన తండ్రి డాక్టర్.. పాలకొల్లులో ఎంతో పెద్ద భవంతి కూడా ఉంది. ఇంట్లో నౌకర్లు , చాకర్లు కూడా ఉండేవారు.
అలాంటి వ్యక్తి తనకు కుర్చీ తీసుకురావడం ఏంటి అని కంగారుపడుతుంటే.. రాఘవగారు అడ్డుకున్నారు. కానీ రేలంగి గారు మాత్రం సంకోచించకుండా లోపలికి వెళ్లి కుర్చీలు తీసుకొచ్చారు. ఆ తర్వాత పనిమనిషి టీలు తీసుకురాగా టీ కప్పులను లోపల పెట్టమని మరోసారి రాఘవగారు రేలంగికి ఆదేశించారు. దాసరి మళ్లీ కంగారు పడ్డారు.. కానీ రేలంగి మాత్రం ఆ కప్పులను లోపల పెట్టి కడిగి మరీ వచ్చారు. ఇకపోతే దాసరి వెళ్ళిపోయిన తర్వాత రేలంగిని ఆపి రాఘవగారు ఇంతమంది నౌకర్ లు ఉన్నా.. నిన్నే ఎందుకు పని చేయమన్నానో తెలుసా అని అడిగి.. నువ్వు సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు షాట్ రెడీ అయితే ఆర్టిస్ట్ గబగబా వెళ్ళిపోతూ తన చేతిలో ఉన్న కాఫీ కప్పు నీ చేతిలో పెట్టి వెళ్ళవచ్చు.. వారి చేతిలో ఉన్న చెప్పులు నీ చేతికి ఇవ్వచ్చు. ఎలాంటి పని అయినా సరే నిర్మొహమాటంగా చేయగలిగినప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తావు అని చెప్పారట. అలా కష్టపడి రేలంగి గారు దర్శకుడిగా ఎదిగి గొప్ప వ్యక్తిగా మారారు.