కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రను ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు ఆ పార్టీ మాజీ చీఫ్, వయోనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. తెలంగాణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిరోజు పాదయాత్ర ముగిసింది. నారాయణపేట జిల్లా గూడబెల్లూరులో పాదయాత్రకు బ్రేక్ పడింది. రాహుల్ గాంధీ తొలిరోజు తెలంగాణలో కేవలం నాలుగు కిలోమీటర్ల మేర పాదయాత్ర మాత్రమే చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ సమాన హక్కుల కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రజలు భారత్ చోడో యాత్రను ఆదరించారని.. ఈ యాత్రను ఏ శక్తి ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ లు మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అద్భుతమైన మార్పులు చూస్తారని అన్నారు.