ఉప్పెన టీజర్ లో ఆ స్టార్ కనిపించకపోవడానికి కారణం అదే..

-

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన సినిమా టీజర్ విడుదలైంది. క్రితిశెట్టి హీరోయిన్ గా కనిపించిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత వెండితెరపై అద్భుతమైన ప్రేమ కథని చూడబోతున్నామని టీజర్ చూస్తే అర్థం అయ్యింది. ఐతే టీజర్ మొత్తంలో హీరో, హీరోయిన్ తప్ప ఇంకెవరూ కనిపించలేదు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐతే అలా చూపించకపోవడానికి కారణాలేంటని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, కావాలనే విజయ్ సేతుపతి క్యారెక్టర్ ని కావాలనే దాచిపెట్టారట. ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందట. హీరోయిన్ నాన్నగా కనిపించిన సేతుపతి చాలా క్రూరంగా కనిపిస్తాడట. అతని వేషభాషలు చాలా కొత్తగా ఉంటాయట. టీజర్లోనే రిలీజ్ చేయడం ఎందుకని మరికొన్ని రోజుల పాటు ఆపుతున్నారట. మరి అంతగా దాచిపెట్టాలని చూస్తే మరింత ఇంట్రెస్ట్ కలగడం సహజమే. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఉప్పెన సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news