ఆర్ఆర్ఆర్ టీమ్ కు దిల్ రాజు అందించిన స్పెషల్ గిఫ్ట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్ఆర్అర్ సినిమా ఎంతటి ఘన సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో నాటునాటు పాట తాజాగా ఆస్కార్ అవార్డును గెలుచుకొని భారతీయ సినీ ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమాకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు రాగా తాజాగా ఓ స్పెషల్ గిఫ్ట్ ను అందించారు నిర్మాత దిల్ రాజు.

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంతటి ప్రతిష్టలు సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఈ పాట గోల్డెన్ గ్లోబ్ ఆవార్డును సొంతం చేసుకోవడంతో పాటు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సైతం దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కారణ అందుకున్న ఈ పాట క్రేజ్ మాత్రం ఇప్పటి వరకు ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.

కాగా అర్ఆర్ఆర్ టీంకు నిర్మాత దిల్ రాజు స్పెషల్ గిఫ్ట్ ను అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తరపున ఈ చిత్ర యూనిట్కు ప్రత్యేకంగా గిఫ్ట్ అందజేసిన దిల్ రాజు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ గిఫ్ట్ లో గ్లోబ్, ప్రశంస పత్రం, నాటు నాటు స్టెప్స్ తో పాటు ఫోటో, క్లాప్ బోర్డ్, మూవీ రీల్ ఇలా ప్రతి ఒక్కటి సినీ ఇండస్ట్రీని ప్రతిబింబించేలా దిల్ రాజు ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్టు తెలుస్తోంది. అలాగే శిరీష్ హన్సిత హర్షిత్తో కలిసి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, దానయ్య, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ లకు దిల్ రాజు ప్రత్యేకంగా గిఫ్ట్లు అందజేసినట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఓ వీడియో ఎస్వీసీ ట్విటర్ ఖాతాలో తాజాగా విడుదల కాగా అది వైరల్ గా మారింది.