మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకున్న స్టార్ విలన్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటులు.. నాటి నుంచి నేటి వరకు విలన్ పాత్రలు పోషించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో ఒకప్పుడు స్టార్ హీరో గా నటించి.. ఇప్పుడు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వారు కూడా చాలా మందే ఉన్నారు.. అలా వచ్చి ఇలా తమ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి .. అభిమానుల చేత చివాట్లు తిన్నారు అంటే చాలు వారి నటన ఎంత అద్భుతంగా ఉందో మనం అర్థం చేసుకోవడానికి. అయితే మీరు అందరూ ఒక్కసారిగా కనుమరుగు కావడంతో ఇండస్ట్రీలో విలన్ లు లేక హీరోలే విలన్లుగా మారుతున్నారు. ఏ సినిమాలో అయినా సరే హీరో కంటే విలన్ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. విలన్ ఎంత గట్టిగా పోటీ ఇస్తే.. హీరోకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే విలన్లుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని.. ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వారిలో ప్రముఖ విలన్ అలాగే నటుడు రఘువరన్ కూడా ఒకరు.Actress Rohini slams media intrusion as husband Raghuvaran lay dead

రఘువరన్ నటుడిగా, విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకొని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. 1958 డిసెంబర్ 11వ తేదీన కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొలెంగూడ అనే ప్రాంతం లో జన్మించారు. 1986 లో మిస్టర్ భరత్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.ఇక ఆ తర్వాత న్యాయానికి సంకెళ్ళు, చైతన్య, కాంచన సీత, పసివాడి ప్రాణం, జేబుదొంగ, శివ, అంజలి ,కిల్లర్, ప్రేమికుడు, ముత్తు, ఒకే ఒక్కడు , ఎవడైతే నాకేంటి, రక్షకుడు, అరుణాచలం , సుస్వాగతం వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ భాషల చిత్రాలను కలుపుకుని మొత్తం 150 కి పైగా సినిమాలలో నటించారు.Viral Pics: Have you seen Raghuvaran-Rohini's son who is all grown up now? - We Magazine Simple And Sensible

సహా నటి రోహిణిని వివాహం చేసుకున్న తర్వాత ఒక బాబు జన్మించాడు . కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక 2008లో నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా సినిమా తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. చెడు అలవాట్లకు బానిస అయిన రఘువరన్ కాలేయ సంబంధిత వ్యాధులు కూడా రావడంతో 2008 మార్చి 19వ తేదీన గాఢనిద్రలో ఉండగానే గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. మద్యానికి బానిస కావడం వల్లే ఇలా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం తో ఆయన స్వర్గస్తులవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news