Bigg Boss OTT Telugu : ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో న్యూ లవ్ స్టోరి..ఆ ఇద్దరి మధ్య అసలేముంది!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ప్రతీ సీజన్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ మధ్య ఏదో ఒక రిలేషన్ షిప్ ఏర్పడుతుండటం మనం చూడొచ్చు. కొందరి మధ్య లవ్ స్టోరి డిస్కషన్స్ గురించి సోషల్ మీడియాలో బోలెడంత డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే వారిద్దరు లేదా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, వారు లవ్ ట్రాక్ ను డైరెక్ట్ గానే బయటకు చెప్పేయడం చూశాం. సీజన్ ఫైవ్‌లో ఫ్రెండ్స్ అని చెప్తూనే షణ్ముక్ జస్వంత్, సిరి హన్మంత్ మధ్య జరిగిన దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక ఈ ఓటీటీ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షోలోనూ లవ్ ట్రాక్ సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. తేజస్వి మడివాడ షో నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ తో షో రన్ అవుతోంది. ఇకపోతే ‘బిగ్ బాస్’ షోలోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన అషురెడ్డి ఈ సారి తాను గేమ్ ఆడేందుకే షో కు వచ్చానని చెప్పింది.

హౌస్ లో అషురెడ్డి బిహేవియర్ చూస్తుంటే కొంచెం అనుమానం వస్తుందనే చర్చ అయితే జరుగుతున్నది. రిలేషన్ షిప్ వంటివి ఇంట్రెస్ట్ లేవని పేర్కొన్న ఈ భామ అఖిల్ ను మాత్రం అంటి పెట్టుకునే ఉంటున్నది. సారీలు చెప్పడం, అలగడం వంటివి చూస్తుంటే ట్రాక్.. లవ్ స్టోరి వరకు వచ్చిందా అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి.

మగవాళ్లతో స్నేహం చేయడం అలా కుదిరేసిందని సుమ ప్రశ్నకు ఉగాది వేళ సమాధానమిచ్చిన అషురెడ్డి.. తన లవ్ అఖిల్ అని కామెంట్ చేయడం వెనుక నెట్టింట చర్చ జరుగుతున్నది. ఇకపోతే ఈ అఖిల్ విషయమై డిస్కషన్ లో అషురెడ్డి నటరాజ్ మాస్టర్ తో మాట్లాడింది. తాను అఖిల్ కు కనెక్ట్ అయ్యానని చెప్పింది. అయితే, ఇకపైన అలా ఉండబోనని అంది. చూడాలి మరి.. ఈ ట్రాక్.. ఎక్కడి వరకు కంటిన్యూ అవుతుందో…

Read more RELATED
Recommended to you

Latest news