అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ వీళ్ళే..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు తమ కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరోలుగా, హీరోయిన్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.మరి కొంతమంది 15, 16 సంవత్సరాల వయసులో హీరోయిన్గా అడుగుపెట్టి ఇప్పటికి కూడా చక్రం తిప్పుతున్నారు. ఇక మరి కొంతమంది అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ లుగా వచ్చి.. అడపా దడపా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు మరి వారెవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఇలియానా:

సుకుమార్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా దేవదాసు చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఇందులో హీరోగా రామ్ నటించగా.. వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా విడుదల సమయంలో ఇలియానా వయసు కేవలం 18 సంవత్సరాలు కావడం గమనార్హం.

శ్వేతా బసు ప్రసాద్:

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్త బంగారులోకం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఎకడా అనే డైలాగ్ తో బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక మొదటిసారి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్వేతాబసు ప్రసాద్.. ఈ సినిమా విడుదల సమయంలో ఈమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే..

కృతి శెట్టి:Krithi Shetty | అత‌నే నా క్ర‌ష్‌.. ఓపెన్‌గా చెప్పేసిన కృతి శెట్టి
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్ గా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైన చిత్రం ఉప్పెన.. ఈ సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇక అప్పుడు ఈమె వయసు 17 సంవత్సరాలు.

హన్సిక:

దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే.

అవికా ఘోర్:

Avika ghor : వామ్మో పెద్ద బాధ్యత తీసుకున్న చిన్నారి పెళ్లికూతురు… తన ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..! |
చిన్నారి పెళ్ళికూతురు అనే సీరియల్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోయిన్ గా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది. అప్పుడు ఈమె వయసు 16 సంవత్సరాలు.

తమన్నా:Tamannaah Bhatia Hot Images: Actress Tamannaah turns up the heat in modern dress | Tamannaah Bhatia Pics: పింక్ డ్రెస్‌లో తమన్నా భాటియా.. మిల్కీ బ్యూటీ అందాలే వేరు! వినోదం News in Telugu
మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అప్పుడు ఈమె వయసు 15 సంవత్సరాలు

సదా:
జయం సినిమాతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సదా ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది . అప్పుడు ఈమె వయసు 17 సంవత్సరాలు.

Read more RELATED
Recommended to you

Latest news