ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!

-

ప్రస్తుతం శుక్రవారం వస్తోందంటే చాలు థియేటర్లకంటే ఓటీటీ లోనే ఎక్కువ సందడి మొదలవుతోంది. ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు ఒక్కరోజే ఏకంగా ఓటీటీలో 18 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.. ఓటీటీ లో రావడానికి 18 సినిమాలు ఉన్నా కూడా అందులో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. అందులో ధనుష్ సార్, సుహాస్ రైటర్ పద్మభూషణ్ సినిమాలపై మెయిన్ ఫోకస్ ఉంది. ఇక ఆహా, జీలో కొత్త సినిమాలు వస్తున్నాయి.

తమిళంలో ధనుష్ నటించిన సార్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తమిళంలో వాతి అంటూ రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లను కొల్లగొట్టేసింది. ఇలా క్లాస్ సినిమాతో మాస్ కలెక్షన్ రాబట్టిన ధనుష్ సినిమాపై అందరి దృష్టిపడింది. ఇక ఈరోజు నుంచి నెట్ఫ్లిక్స్ లో సార్ సినిమా అందుబాటులోకి రాబోతోంది. మరొకవైపు చిన్న సినిమాగా రిలీజ్ అయిన రైటర్ పద్మభూషణ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు వసూళ్లతో పాటు ప్రశంసలు కూడా లభించాయి. ఈరోజు నుంచి ఈ చిత్రం జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది..

ఇక వీటితోపాటు ఆహా లో కొత్త ప్రాజెక్టు రాబోతోంది. పుష్ప ఫేమ్ కేశవ హీరోగా నటించిన సత్తి గాని రెండెకరాలు సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్ఫ్లిక్స్ లో కాట్ అవుట్ క్రైమ్, కరప్షన్, క్రికెట్, కుత్తే, ది మెజీషియన్స్ ఎలిఫెంట్, నాయిస్ వంటి చిత్రాలు రాబోతున్నాయి. మరొకవైపు పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన గంధద గుడి సినిమా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే డామ్ అనే మరో సినిమా కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీ లైవ్ లో రాకెట్ బాయ్స్ అనే సినిమా స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.ఈ చిత్రాలన్నీ కూడా ఈ రోజే ఓటిటి వేదికగా సందడి చేయబోతుండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news