ఈ వారం ఓ టీ టీ , థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలివే..!!

-

ఇకపోతే 2022 సంవత్సరానికి గాను అర్థభాగం ఈ వారం తో పూర్తవుతుంది. ఇక మొదటి అర్ధ భాగంలో అన్ని పాన్ ఇండియా సినిమాలు, అగ్ర హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సందడి చేశాయి.. ఇక జేష్ట మాసం పూర్తయి ఆషాడ మాసం మొదలు అవుతున్న నేపథ్యంలో చిరుజల్లుల సవ్వడి మొదలయింది. ఇక ఈ క్రమంలోనే జూలై మొదటి వారంలో కాలేజీలు , స్కూలు కూడా తెరుచుకోబడుతున్నాయి .ఈ క్రమంలోనే ఓ టీ టీ మరియు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న చిత్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

1. పక్కా కమర్షియల్:
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా యాక్షన్, కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కబోతోంది. ఇక మారుతి సినిమాల పై ప్రేక్షకులకు ఎంతగానో నమ్మకం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జులై ఒకటో తేదీన విడుదల అవుతున్న పక్కా కమర్షియల్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం.

2. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ :
ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు ఇక ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా కూడా జూలై ఒకటవ తారీఖున తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. అంతే కాదు ఇందులో షారుక్ ఖాన్, సూర్య వంటి స్టార్ హీరోలు అతిథి పాత్ర పోషించారు.

3. ఏనుగు:
అరుణ్ విజయ్ , ప్రియ భవాని శంకర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. సింగం సినిమాల దర్శకుడు హరి ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రం కూడా జూలై 1వ తేదీన థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో ఒకేసారి విడుదల కాబోతుండడం గమనార్హం.

4. గంధర్వ:
సందీప్ మాధవ్ గాయత్రి ఆర్ సురేష్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై ఒకటవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. సాయి కుమార్, బాబు మోహన్ , సురేష్ వంటివారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీటితోపాటు టెన్త్ క్లాస్ డైరీస్, షికారు తదితర చిత్రాలు జూలై ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక ఓటీటీ విషయానికి వస్తే ..
1. ధాకడ్: కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా జీ ఫైవ్ ఓ టి టి వేదికగా జూలై 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

2. అన్యాస్ ట్యుటోరియల్:
ఆర్క మీడియా పతాకం పై నిర్మించిన వెబ్ సిరీస్ ఇది. ఇందులో రెజీనా, నివేదిత సతీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు . ఆహా వేదికగా జూలై 1 నుంచి తెలుగు, తమిళ్లో ప్రసారం కానుంది.

ఇక జూలై 1న అమెజాన్ ప్రైమ్ లో డి టర్మినల్ లిస్ట్ .. నెట్ఫ్లిక్స్ వేదికగా జూన్ 28న బ్లాస్టెడ్ తో పాటు మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు కూడా ఓ టీ టీలో సందడి చేయనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version