చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు డ్యుయల్ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. చాలా వరకు ద్విపాత్రాభినయం చేసిన హీరోలు మంచి విజయాన్ని అందుకున్నారు. కొంతమంది నటన పరంగా ప్రేక్షకులను సరైన రీతిలో మెప్పించలేక ప్రేక్షకులను నిరాశ పరిచారు. కానీ తెలుగులో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించిన కొన్ని ఉత్తమ చిత్రాల హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. విక్రమార్కుడు – రవితేజ:
ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేసి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఒకవైపు కామెడీ , మరో వైపు మాస్ యాక్షన్ తో మాస్ మహారాజ గా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో ఒక పాత్రలో దొంగ గా కనిపించిన రవితేజ ,మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా ఇరగదీశారు అని చెప్పవచ్చు. అటు నటన పరంగా, ఇటు కథ పరంగా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. ఇక డ్యూయల్ పాత్రలో రవితేజకు కూడా మంచి పేరు వచ్చింది.
2. నాయక్ – రామ్ చరణ్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాయక్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఒక పాత్రలో కాలేజ్ స్టూడెంట్ గా ,మరో పాత్రలో యూత్ నాయకుడిగా నటించి యువతను బాగా ఆకర్షించాడు. ఇందులో అమలాపాల్, కాజల్ నటించి తమదైన శైలిలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో జయప్రకాశ్ రెడ్డి , బ్రహ్మానందం ల మధ్య సాగే కామెడీ సన్నివేశాలు చిత్రానికి హైలెట్ గా నిలిచాయి..
3. మా అన్నయ్య – రాజ శేఖర్:
యాంగ్రీ మాన్ రాజశేఖర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం లో నటించి బాగా గుర్తింపు పొందాడు..అన్న అంటే తల్లి కంటే ఎక్కువ అని, కుటుంబం అంటే ఎలా ఉండాలి అనే చక్కని సారాంశం తో ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను , యువతను కూడా బాగా ఆకట్టుకుంది.
4. అదుర్స్ – NTR:
ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక సరికొత్త యాంగిల్లో ప్రేక్షకులకు కనిపించి మంచి వినోదాన్ని పంచాడు. అదుర్స్ సినిమాలో ఒక వైపు బ్రాహ్మణ అబ్బాయి గా.. మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా తనదైన శైలిలో నటించిన ఎన్టీఆర్ విశేష ప్రేక్షకాదరణ కూడా పొందాడు.
ఇక వీటితో పాటు ఖైదీ నెంబర్ 150 – చిరంజీవి, జెంటిల్ మెన్ – నాని, చెన్నకేశవరెడ్డి – బాలకృష్ణ, హలో బ్రదర్ – నాగర్జున, పెదరాయుడు – మోహన్ బాబు వంటి వారు ఈ సినిమాల లో హీరోలు ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.