ముచ్చటగా మూడోసారి ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్‌..!

-

గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి రేపటితో తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రేపు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి సీఎం ఉద్ధవ్‌ను ఆదేశించారు.  దీనిపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Fadnavis camp' vs old guard — No open revolt but resentments in Maharashtra  BJP can be heard

అయితే.. బలపరీక్షకు ముందే బలం లేని ఉద్ధవ్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు, మరికాసేపట్లో గోవాలోని తాజ్‌లో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏక్‌నాథ్ షిండే మాట్లాడతారు. అలాగే, మహారాష్ట్రలోని బీజేపీ కోర్ గ్రూప్ ఈ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు సంకీర్ణ శివసేన రెబల్స్‌తో కీలక చర్చలు జరపనుంది. పదవుల పంపకంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news