కౌశల్ ఆర్మీ.. తొక్కలో ఆర్మీ.. వాడో బుడబుక్కలోడు.. వాడికంత సీన్ లేదు.. థర్టీ ఇయర్స్ పృధ్వి హాట్ కామెంట్స్..!

-

బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ గా గెలిచిన నాటి నుండి కౌశల్ అతని ఆర్మీ చేస్తున్న హంగామా తెలిసిందే. కౌశల్ ఆర్మీ పేరు చెప్పుకుని డబ్బులు గుంజుతున్నాడన్న వార్తలు వచ్చాయి. ఇదిలాఉంటే tv5 మూర్తి, తనీష్, బాబు గోగినేని అతన్ని, అతని ఆర్మీని టార్గెట్ చేశారు. అయితే ఈమధ్య కౌశల్ ఆర్మీ సభ్యులే కౌశల్ కు వ్యతిరేకంగా మాట్లాడారు.

ఇవన్ని చూసిన జనాలకు సేమ్ టూ సేమ్ కత్తి మహేష్, శ్రీ రెడ్డి ఎపిసోడ్ గుర్తుకొచ్చింది. ఇదిలాఉంటే కౌశల్ ఆర్మీపై తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పాడు థర్టీ ఇయర్ పృధ్వి. అసలు కౌశల్ ఆర్మీ ఏంటి భారత సైనిక దళాలకు పెట్టిన పేరుని ఇంతను ఎందుకు వాడుతున్నాడు. కౌశల్ ఆర్మీ లేదు.. తొక్కలో ఆర్మీ లేదు.. అసలు వాడికంత సీన్ లేదు. అసలు ఎవడ్రా నువ్.. అంటూ కౌశల్ పై తన ప్రతాపం చూపించాడు.

tv5 మూర్తి చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. కౌశల్ ఆర్మీ అంతా బోగస్.. కౌశల్ అంతా నటిస్తున్నాడు. ఇక ఆయన భార్య ఏడుపులు అసలు నమ్మాల్సిన పనిలేదని అన్నారు పృధ్వి. టివి 5 ఆఫీస్ ను మూయించేస్తా అనడం.. ప్రధానమంత్రి ఆఫీస్ నుండి ఫోన్ రావడం వంటివి.. మొన్న కే.ఏ.పాల్ పాకిస్థాన్ కు ఫోన్ చేసి యుద్ధం వద్దని చెప్పడం లాంటిదే అని.. వాడొక బుడబుక్కలవాడు.. వీడొక మరో బుడబుక్కలవాడు.. అయితే వీడు కాస్త అందంగా ఉంటాడని అన్నారు. 5 లక్షలు కడితే డాక్టరేట్ ఇస్తారు. అలాంటిది ఇతనేదో సాధించినట్టుగా బిల్డప్ ఇస్తున్నారని అన్నాడు పృధ్వి. మరి ఇతని కామెంట్స్ కు కౌశల్ ఆర్మీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news