ఈ బాలీవుడ్ హీరోయిన్ చాలా డిఫ్రెంట్ …ఎందుకో తెలుసా ..?

-

అదితి రావు హైదరి ..మంచి పర్ఫార్మర్…బ్యూటి ఫుల్ యాక్ట్రెస్..ఫెంటాస్టిక్ హీరోయిన్ ..ఇలా చాలా మాటలు వినిపిస్తాయి. బాలీవుడ్ లో సంజయ్ దత్ తో చేసిన భూమి సినిమా తో అద్భుతమైన పేరు ని సంపాదించుకుంది. అంతకముందు కూడా ఫితూర్, మర్డర్, వాజిర్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే ఏ సినిమాని ఒప్పుకున్న నటనకి ఆస్కారం ఉన్న పాత్రలే ఒప్పుకోవడం గొప్ప విషయం.

 

ఇక తెలుగులో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగులో కూడా చక్కని అభినయంతో గుర్తింపుని దక్కించుకుంది. ఇక మరోసారి మోహన్ కృష్ణ ఇంద్రగంటి రూపొందుతున్న ‘వి’ సినిమాలో అదితి రావు హైదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. నాని, నివేదా థామస్, సుధీర్ బాబు నటిస్తున్నారు. అయితే హీరోయిన్స్ అందరి కంటే విభిన్నంగా ఆలోచిస్తున్న అదితి రావు హైదరి ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. అయితే ఈ సినిమాలో అదితి రావు హైదరి నానికి జోడిగా నటిస్తోందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇక అదితి రావు హైదరి టాలీవుడ్ లో చేసిన రెండు సినిమాలు ఇంద్రగంటి మోహన కృష్ణ వి కావడం విశేషం.

ఇక ఈ సినిమాని హిట్ సినిమాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ నేపథ్యంలో పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న వి సినిమాని జూలై లో రిలీజ్ చేసే వకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఈ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేస్తారన్న మాట కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో మేకర్స్ క్లారొటి ఇస్తేగాని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news