అల్లు అర్జున్ AA20 కి టైటిల్ ఇదేనట .. “పుష్ప” ..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తాజా చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కి 20వ సినిమా కావడం విశేషం. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న తన లేటెస్ట్ మూవీ అప్‌డేట్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఈ సందర్భంగా నిర్మాతలు మైత్రీ మూవీస్ ఈ తాజా చిత్రానికి సంబంధించిన అప్డేట్ రివీల్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా.. ”ఏమబ్బా అందరు బాగుండారా.. మీరు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తాండే.. #AA20 అప్డేట్ ఏప్రిల్ 8 తెల్లార్తే 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా”.. అంటూ రిలీజ్ చేశారు.

 

2021 ప్రారంభంలోనే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కమర్షియల్ సక్సస్ ని సాధించింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రారంభించడంతో ఇప్పటి నుంచే భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు కారణం అల్లు అర్జున్ అల వైకుంఠ పురములో సినిమా తో అలాగే రంగస్థలం సినిమాతో భారీ సక్సస్ ని అందుకొని సుకుమార్ మాంచి ఫాం లో ఉండటమే.

ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా సాగుతూ కరోనా లాక్డౌన్ కారణంగా షెడ్యూల్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను సుకుమార్ శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా విజయ సేతుపతి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘శేషాచలం’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని వార్తలు జోరుగా సాగాయి. కాని తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప’ అనే టైటిల్ ని చిత్ర యూనిట్ ఫిక్సైనట్టు తెలుస్తుంది. దాదాపు ఇదే టైటిల్ అల్లు అర్జున్ బర్త్ డే గా 8 న ఉదయం 9 గంటలకు రివీల్ చేయబోతున్నారని సమాచారం.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ ‘పుష్పక నారాయణ’ అన్న టైటిల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవరు గా కనిపిస్తాడట. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జు పాత్ర మాంచి మాసీగా మేకోవర్ పరంగా బాగా రఫ్ గా ఉంటాడట. అంతేకాదు రాయలసీమ యాసలో మాట్లాడని ఆ యాసలో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని తాజా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news