నిత్యా మీన‌న్ కెరీర్ కు మ‌రో మ‌లుపు…!

-

ఇష్క్, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవి, జ‌న‌తా గ్యారేజ్‌ చిత్రాల‌తో మంచి హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది నిత్యా మీనన్. 2016 త‌ర్వాత ఆమెకి పెద్ద‌గా ఛాన్స్ లు లేవు. నిత్య ప‌ని అయిపోయింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అదే టైమ్‌లో ఆమె పైగా లావెక్కింది. దీని వ‌ల్లే ఆమెకి అవ‌కాశాలు లేవ‌నే వారున్నారు.

కెరీర్ ప్రారంభంలో క్యూట్ అందాల‌తో మెస్మ‌రైజ్ చేసిన నిత్యా మీన‌న్ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో బ్యాక్ టూ బ్యాక్ క్రేజీ ఆఫ‌ర్స్ అందుకుని ఒకానొక ద‌శ‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2008 నుంచి 2016 వ‌ర‌కు దాదాపు ఎనిమిదేండ్లు ఫుల్ స్వింగ్‌లో ఆమె కెరీర్ సాగింది. 2011లో అలా మొద‌లైంది సినిమా ద్వారా తెలుగులో ప‌రిచ‌య‌మై తొలి సినిమాతోనే ఆడియెన్స్ ని ఫిదా చేసింది.

This movie will be another turn for nitya menon career

ఇష్క్, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవి, జ‌న‌తా గ్యారేజ్‌ చిత్రాల‌తో మంచి హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. 2016 త‌ర్వాత ఆమెకి పెద్ద‌గా ఛాన్స్ లు లేవు. నిత్య ప‌ని అయిపోయింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అదే టైమ్‌లో ఆమె పైగా లావెక్కింది. దీని వ‌ల్లే ఆమెకి అవ‌కాశాలు లేవ‌నే వారున్నారు.

గ‌తేడాది అ!, గీత గోవిందంలో గెస్ట్ లుగానే క‌నిపించింది. అనుకోకుండా ఈ ఏడాది ఆమె కెరీర్ తిరిగి పుంజుకుంది. ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో సావిత్రి పాత్ర‌లో మెరిసిన నిత్యా ఇప్పుడు ప‌లు భారీ ప్రాజెక్ట్ ల్లో భాగ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ఆమె త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ది ఐర‌న్ లేడీలో జ‌య‌ల‌లిత‌గా న‌టిస్తుంది. సైకో అనే మ‌రో త‌మిళ సినిమా, రెండు మ‌ల‌యాళ మూవీస్‌, మిష‌న్ మంగ‌ళ్ అనే ఓ హిందీ సినిమాలో న‌టిస్తూ బిజీబిజీగా గ‌డుపుతోంది.

ఇప్పుడు మ‌రో రెండు సినిమాల‌కి సైన్ చేసింద‌ట‌. అందులో ఒక‌టి హీరో నితిన్ నిర్మాణంలో ఉంటుంద‌ని తెలుస్తుంది. త‌న శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని నిర్మించేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నారు. ఫ‌ల‌క్ నుమా దాస్ డైరెక్ట‌ర్ విశ్వ‌క్ సేన్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడ‌ట‌. మ‌రోవైపు యువ హీరో రాజ్ త‌రుణ్‌తోనూ ఓ సినిమా చేయ‌నుంద‌నే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, ఒక లైలా కోసం వంటి సినిమాల‌ని రూపొందించిన ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా నిత్యామీన‌న్‌, రాజ్ త‌రుణ్ జంట‌గా ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడు. త‌న కంటే ఏజ్‌లో సీనియ‌ర్ అయిన అమ్మాయిని ప్రేమించే క‌థాంశంతో ఈ సినిమా సాగుతుంద‌ని తెలుస్తుంది. దీన్ని కె.కె.రాధామోహ‌న్ నిర్మించ‌నున్నాడ‌ట‌. ఈ లెక్క ప్ర‌కారం ఈ ఏడాది నిత్యామీన‌న్ కెరీర్‌కిది మ‌రో ట‌ర్న్ అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news