రాజమౌళి-మహేశ్ మూవీలో థోర్.. హాలీవుడ్ రేంజ్​లో ప్లాన్ చేసిన జక్కన్న!

-

డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్​ బాబు కాంబినేషన్​లో ఓ భారీ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ చిత్రం గురించి రోజుకో ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వస్తోంది. నిన్నటివరకు ఈ సినిమా కోసం జక్కన్న హాలీవుడ్ నుంచి ఓ స్టార్ యాక్టర్​ను రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అది ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు స్టార్ యాక్టర్స్​ అని తెలుస్తోంది.

- Advertisement -

ఎక్స్​ఎక్స్​ఎక్స్​, కెప్టెన్​ మార్వెల్​, స్టార్​ వార్స్​, జురాసిక్​ పార్క్​, స్పైడర్​ మ్యాన్, అవెంజర్స్​, కెప్టెన్​ అమెరికా​​ వంటి హిట్​ చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు శామ్యూల్​ ఎల్​ జాక్స్​తో పాటు తాజాగా అవెంజర్స్​ థోర్​ ఫేమ్ హీరో​ క్రిస్ హెమ్స్ వర్త్​ను తీసుకోబోతున్నట్లు సోషల్​మీడియాలో జోరుగా ప్రచరాం సాగుతోంది. శామ్యూల్​ కీలక పాత్ర పోషించబోతుండగా.. క్రిస్​ అతిథి పాత్రలో కనిపిస్తారట. ప్రస్తుతం నెట్టింట్లో ఈ విషయమే తెగ ట్రెండ్ అవుతోంది. అభిమానులు దీనిపై తెగ చర్చించుకుంటున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజమున్నదో తెలియదు కానీ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. కాగా, శామ్యూల్​ ఒక్కో చిత్రానికి కనీసం రూ.80కోట్లు నుంచి 160కోట్లు రెమ్యునరేషన్​ను తీసుకుంటాడు. ఇక క్రిస్​ అయితే అంతకన్నా ఎక్కువే తీసుకుంటాడు.

ఇటీవలే రాజమౌళి మహేశ్​ సినిమా ఎలా ఉండబోతుందో తెలిపారు. ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’ అంటూ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా ఇది ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు సాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...