2022 సంక్రాంతికి రెడీ అవుతున్న ఆ హీరోలు.. ఎవ‌రంటే..?

-

టాలీవుడ్ ను ఈ ఏడాది కూడా క‌రోనా వెంటాడుతోంది. ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సిన ఎన్నో సినిమాలు సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయాయి. అస‌లు పెద్ద సినిమాలు ఏవీ కూడా ఈ ఏడాది రాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పెద్ద ప్రాజెక్టులు అన్నీ సెట్స్ మీద‌కు వెళ్తున్నాయి. వ‌చ్చే సంక్రాంతి(Sankranti)కి కొంద‌రు పెద్ద హీరోలు త‌మ సినిమాల‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

సంక్రాంతి /Sankranti
సంక్రాంతి /Sankranti

ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమా సర్కారు వారి పాటపై భారీగానే అంచ‌నాలు ఉన్నాయి. దీన్ని ప‌ర‌శురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. దీన్ని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్‌, ద‌గ్గుబాటి రాణాలు క‌లిసి చేస్తున్న అయ్యప్పనమ్ కోషియం ప్రాజెక్టు కూడా 2022సంక్రాంతి బ‌రిలోనే దిగుతోంది.

ఇక ఎన్నో అంచ‌నాల న‌డుమ వ‌స్తున్న వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్న ఎఫ్ 3 సినిమా కూడా 2022 సంక్రాంతి బ‌రిలోనే వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. దీన్ని ఎలాగైనా సంక్రాంతికి రిలీజ్ చేసేలా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. వీరితో పాటే నేష‌న‌ల్ స్టార్ ప్రభాస్ కూడా వ‌రుస‌గా 4 మూవీలు చేస్తున్నారు. ఇందులో ఏదో ఒక‌టి సంక్రాంతికి వ‌చ్చే ఛాన్ష్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి పెద్ద హీరోలు ఒకే సీజ‌న్‌కు పోటీ ప‌డుతున్నార‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Latest news