`షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం` లో మూడు రాజధానులు ప్రస్తావ‌న‌..!

-

ఏపీకి మూడు రాజధానుల అంశం ఎంత హాట్ టాపిక్ గా మారిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాల సెటైర్లు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. షకీలా తొలిసారిగా రాసిన కుటుంబ కథా చిత్రం టీజర్ లో ఏపీకి మూడు రాజధానుల అంశం గురించిన ప్రస్తావన ఉంది. షకీలా ప్రధాన పాత్రలో విక్రాంత్, పల్లవి ఘోష్‌ జంటగా నటించిన చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’. 24 క్రాఫ్ట్స్‌ బ్యానర్‌పై సీవీ రెడ్డి సమర్పణలో సీహెచ్‌ వెంకట్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిం చారు.

సాయి రాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్‌ వి.ఎన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజ‌ర్‌లో కుర్చీలో కూర్చుని ఉన్న షకీలా ఓ పత్రికలో పతాక శీర్షిక ‘ఆంధ్రాకు మూడు రాజధానులు’ను చూడటం ఆ టీజర్ లో కనబడుతుంది. ‘ఆంధ్రాకు మూడు రాజధానులా?’ అంటూ తన పక్కనే నిలబడి ఉన్న ఓ వ్యక్తిని షకీలా ప్రశ్నించగా…‘అవును మేడమ్.. జగనన్న మూడు రాజధానులు చేశారుగా’ అని సమాధానం చెబుతాడు. ‘ఒక్క స్టేట్ కే మూడు రాజధానులా? పోను పోను.. ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ షకీలా విస్మయం వ్యక్తం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news